ఏలినవాఁడవు నీ ఇచ్చలోనివారము
(॥పల్లవి॥)
ఏలినవాఁడవు నీ ఇచ్చలోనివారము
యేలాగున నడిపినా ఇంతా సంతోసమే
(॥ఏలి॥)
మలసి నీమాటలకు మారుమాట లాడనేల
వొలసి వూంకొంటాను వుండుదుఁగాక
చలపాదివాఁడవు నీజాడలు విడువ వెందు
చెలరేఁగి ఇట్టె చవిసేసుకొనే విన్నియు
(॥ఏలి॥)
చేసుకొన్నబాసల నీచేఁతకు చేఁత మాకేల
వొసరించి నీకు లోనై వుండేఁగాక
ఆసోదకాఁడపు నిన్నన్నిటాఁ దనుపరాదు
వాసితోనే మెచ్చి సేవలు సేసే విపుడు
(॥ఏలి॥)
చేవదేరెఁ గూడితివి సిగ్గుకు సిగ్గిఁకనేల
వోవరిలో నవ్వుకొంటానుండేఁగాక
శ్రీవేంకటేశుఁడవు చెల్లుబడి విడువవు
భావించి నీవారమై బతికేము నేము
(||pallavi||)
elinavām̐ḍavu nī ichchalonivāramu
yelāguna naḍibinā iṁtā saṁtosame
(||eli||)
malasi nīmāḍalagu mārumāḍa lāḍanela
vŏlasi vūṁkŏṁṭānu vuṁḍudum̐gāga
salabādivām̐ḍavu nījāḍalu viḍuva vĕṁdu
sĕlarem̐gi iṭṭĕ savisesugŏne vinniyu
(||eli||)
sesugŏnnabāsala nīsem̐tagu sem̐ta māgela
vŏsariṁchi nīgu lonai vuṁḍem̐gāga
āsodagām̐ḍabu ninnanniḍām̐ danubarādu
vāsidone mĕchchi sevalu sese vibuḍu
(||eli||)
sevaderĕm̐ gūḍidivi siggugu siggim̐kanela
vovarilo navvugŏṁṭānuṁḍem̐gāga
śhrīveṁkaḍeśhum̐ḍavu sĕllubaḍi viḍuvavu
bhāviṁchi nīvāramai badigemu nemu