Elinavaamdavu gana yeppudu rakshimcheve

ఏలినవాఁడవు గన యెప్పుడు రక్షించేవే
Language

(॥పల్లవి॥)
ఏలినవాఁడవు గన యెప్పుడు రక్షించేవే
వేళతోఁ గొలువని వెల్లా లెస నోర్చుకొనవే

(॥ఏలిన॥)
అండ నూరకే ముదిసి యపచార మౌనో యని
దండములెట్ట నోపక దగ్గరి రాను
చండి పోరి ముదిమి మాన్చఁగ వలెనని కాదు
దండము వెట్టని నా తప్పు సహించుకోవే

(॥ఏలిన॥)
నిలుచుండ సత్వలేక నేరమి వచ్చునో యని
కొలువు సేయక మఱఁగున నుంటిని
చలపట్టి నిన్ను నిట్టి సత్వ యిమ్మని కాదు
కొలువని నేరమి కెగ్గులుగాఁ బట్టకువే

(॥ఏలిన॥)
పాట రంజకములేక పక్కన నవ్వేవో యని
మాటలనే పొగడితి మాపటిదాఁకా
నీటున శ్రీవేంకటేశ నే వేసరించుట గాదు
పాటించి పాడని నా యపరాధ మెంచకువే

(||pallavi||)
elinavām̐ḍavu gana yĕppuḍu rakṣhiṁcheve
veḽadom̐ gŏluvani vĕllā lĕsa norsugŏnave

(||elina||)
aṁḍa nūrage mudisi yabasāra mauno yani
daṁḍamulĕṭṭa nobaga daggari rānu
saṁḍi pori mudimi māncham̐ga valĕnani kādu
daṁḍamu vĕṭṭani nā tappu sahiṁchugove

(||elina||)
nilusuṁḍa satvalega nerami vachchuno yani
kŏluvu seyaga maṟam̐guna nuṁṭini
salabaṭṭi ninnu niṭṭi satva yimmani kādu
kŏluvani nerami kĕggulugām̐ baṭṭaguve

(||elina||)
pāḍa raṁjagamulega pakkana navvevo yani
māḍalane pŏgaḍidi mābaḍidām̐kā
nīḍuna śhrīveṁkaḍeśha ne vesariṁchuḍa gādu
pāḍiṁchi pāḍani nā yabarādha mĕṁchaguve