ఏలిన పతివి నీవు ఇల్లాల నేను
(॥పల్లవి॥)
ఏలిన పతివి నీవు ఇల్లాల నేను
తాలిమితో నుందుఁ గాక తమకించేనా
(॥॥)
మంతనాన బుజ్జగించి మంచిమాట లాడేవు
వింతదాననా నేను విచారించితే
యెంతవడి రాకుండినా నెక్కడెక్కడ నుండినా
పంతము తోడుత నిన్ను బాస లడిగేనా
(॥॥)
వీడెము చేతికిచ్చి వేఁడుకొనేవు
ఆడుకొనేదాననా నిన్నందరిలోన
యేడోసతుల నంటినా యెన్ని చేఁతలు సేసినా
జాడ దెలియక నిన్ను సాదించేనా
(॥॥)
కలసి రతుల నిన్ను గారవించేవు
చలమరిదాననా నీ సముకమున
యెలమి శ్రీ వేంకటేశ యె నలమేలు మంగను
కలసితి మిఁక నిన్నుఁ గమ్మటి నవ్వేనా
(||pallavi||)
elina padivi nīvu illāla nenu
tālimido nuṁdum̐ gāga tamagiṁchenā
(||||)
maṁtanāna bujjagiṁchi maṁchimāḍa lāḍevu
viṁtadānanā nenu visāriṁchide
yĕṁtavaḍi rāguṁḍinā nĕkkaḍĕkkaḍa nuṁḍinā
paṁtamu toḍuda ninnu bāsa laḍigenā
(||||)
vīḍĕmu sedigichchi vem̐ḍugŏnevu
āḍugŏnedānanā ninnaṁdarilona
yeḍosadula naṁṭinā yĕnni sem̐talu sesinā
jāḍa dĕliyaga ninnu sādiṁchenā
(||||)
kalasi radula ninnu gāraviṁchevu
salamaridānanā nī samugamuna
yĕlami śhrī veṁkaḍeśha yĕ nalamelu maṁganu
kalasidi mim̐ka ninnum̐ gammaḍi navvenā