Eligasaanigi nemu yidavarulamu tolle

ఏలికసానికి నేము యితవరులము తొల్లె
Language

(॥పల్లవి॥)
ఏలికసానికి నేము యితవరులము తొల్లె
నీ లీలకు లోనైతే నీవేపాటి వట్టేవా

(॥॥)
బలిమి మాయక్కవిన్నపములు నేతుముగాక
చెలికతైల కేఁటికి సిగ్గువడను
తలకొన్ననీచేఁతలు తారుకాణింతుముగాక
యెలమి నీతో మాకు నేల మొకదాకిరి

(॥॥)
కొద్దిమీర నా కెమారై కొసరుదు మింతేకాక
వద్దనున్న వారికేల వట్టినేస్తాలు
సుద్దులతో నీగుణాలు సోదించి కందుముగాక
కద్దులేదని మాకేల కప్పి పెట్టి దాఁచను

(॥॥)
యీడ నిన్నలమేల్మంగతోడఁ గూరుతుము గాక
వూడిగపువారికేల వొడ్డారాలు
కూడితి వింతలో నింతఁ గోరి శ్రీవేంకటేశ నీ
వేడుక మెత్తుము గాక వింతలేల సేయను

(||pallavi||)
eligasānigi nemu yidavarulamu tŏllĕ
nī līlagu lonaide nīvebāḍi vaṭṭevā

(||||)
balimi māyakkavinnabamulu nedumugāga
sĕligadaila kem̐ṭigi sigguvaḍanu
talagŏnnanīsem̐talu tārugāṇiṁtumugāga
yĕlami nīdo māgu nela mŏgadāgiri

(||||)
kŏddimīra nā kĕmārai kŏsarudu miṁtegāga
vaddanunna vārigela vaṭṭinestālu
suddulado nīguṇālu sodiṁchi kaṁdumugāga
kadduledani māgela kappi pĕṭṭi dām̐sanu

(||||)
yīḍa ninnalamelmaṁgadoḍam̐ gūrudumu gāga
vūḍigabuvārigela vŏḍḍārālu
kūḍidi viṁtalo niṁtam̐ gori śhrīveṁkaḍeśha nī
veḍuga mĕttumu gāga viṁtalela seyanu