ఏలిక బంటువరుస కిది చెల్లునా
(॥పల్లవి॥)
ఏలిక బంటువరుస కిది చెల్లునా
ఆలరినై తిరిగెద నపరాధమా
(॥ఏలిక॥)
నీవు దేహ మియ్యఁగాను నంబరము గోరెను
ఆవల నా కిది యొక్క అపరాధము
చేవదేర సంసారిఁ జేయఁగా విజ్ఞాని నయ్యె
ఆవటించి నిదియొక అపరాధము
(॥ఏలిక॥)
పంచేంద్రియముల నాపైపంపు నీవు వెట్టఁగా
అంచనేఁ దోసె ననేది అపరాధము
కంచములోఁ బెట్టి నీవు కర్మము సేయించఁగాను
అంచున దొచ్చి విడిచె నది యపరాధమూ
(॥ఏలిక॥)
సన్నిథై నీవుండఁగాను సంతోషానందమున
నన్ను వట్టియున్నాఁడ నపరాధము
యెన్నిక శ్రీ వేంకటేశ యెదురాడ నీకు నేను
అన్నిటాఁ గాచితివి నా యపరాధమూ
(||pallavi||)
eliga baṁṭuvarusa kidi sĕllunā
ālarinai tirigĕda nabarādhamā
(||eliga||)
nīvu deha miyyam̐gānu naṁbaramu gorĕnu
āvala nā kidi yŏkka abarādhamu
sevadera saṁsārim̐ jeyam̐gā vijñāni nayyĕ
āvaḍiṁchi nidiyŏga abarādhamu
(||eliga||)
paṁcheṁdriyamula nābaibaṁpu nīvu vĕṭṭam̐gā
aṁchanem̐ dosĕ nanedi abarādhamu
kaṁchamulom̐ bĕṭṭi nīvu karmamu seyiṁcham̐gānu
aṁchuna dŏchchi viḍisĕ nadi yabarādhamū
(||eliga||)
sannithai nīvuṁḍam̐gānu saṁtoṣhānaṁdamuna
nannu vaṭṭiyunnām̐ḍa nabarādhamu
yĕnniga śhrī veṁkaḍeśha yĕdurāḍa nīgu nenu
anniḍām̐ gāsidivi nā yabarādhamū