Elidivi nannum dolle yimtagaa mannimchidivi

ఏలితివి నన్నుఁ దొల్లె యింతగా మన్నించితివి
Language

(॥పల్లవి॥)
ఏలితివి నన్నుఁ దొల్లె యింతగా మన్నించితివి
ఆలించి నా విన్నపము లవధరించవయ్యా

(॥ఏలి॥)
కోపగించరాదు నీతో గుంపెన చూపఁగరాదు
వైపుగా నిచ్చక మాడవలెఁగాని
రాఁపులఁ బెట్టఁగరాదు రట్టుసేసి చూపరాదు
చేపట్టి నీవే కృపసేయవయ్యా

(॥ఏలి॥)
కన్నుల జంకించరాదు కడుఁ దమకించరాదు
వన్నెగా బత్తి నెరపవలెఁగాని
సన్నలఁ గొసరరాదు సారెకుఁ బెనఁగరాదు
అన్నిటా నీవే నన్ను నాదరించవయ్యా

(॥ఏలి॥)
పాడి పంతా లెంచరాదు పైపై సిగ్గువడరాదు
వాడికగాఁ గాఁగిలించవలెఁగాని
కూడితివి నన్ను నిట్టె గురిగా శ్రీవేంకటేశ
వేడుకతో వరమిచ్చి వెలయించవయ్యా

(||pallavi||)
elidivi nannum̐ dŏllĕ yiṁtagā manniṁchidivi
āliṁchi nā vinnabamu lavadhariṁchavayyā

(||eli||)
kobagiṁcharādu nīdo guṁpĕna sūbam̐garādu
vaibugā nichchaga māḍavalĕm̐gāni
rām̐pulam̐ bĕṭṭam̐garādu raṭṭusesi sūbarādu
sebaṭṭi nīve kṛpaseyavayyā

(||eli||)
kannula jaṁkiṁcharādu kaḍum̐ damagiṁcharādu
vannĕgā batti nĕrabavalĕm̐gāni
sannalam̐ gŏsararādu sārĕgum̐ bĕnam̐garādu
anniḍā nīve nannu nādariṁchavayyā

(||eli||)
pāḍi paṁtā lĕṁcharādu paibai sigguvaḍarādu
vāḍigagām̐ gām̐giliṁchavalĕm̐gāni
kūḍidivi nannu niṭṭĕ gurigā śhrīveṁkaḍeśha
veḍugado varamichchi vĕlayiṁchavayyā