ఏలే యింతేసిచేఁత యీఁతా మోఁతా
(॥పల్లవి॥)
ఏలే యింతేసిచేఁత యీఁతా మోఁతా
వేళ వచ్చినదాఁకా వెరగులే చాలు
(॥ఏలే॥)
తప్పక చూడవెరతు తలవంచుకో వెరతు
అప్పటప్పటి సుద్దులు అవెచాలు
కప్పురము లంటనేల కాఁకలఁ బొరలనేల
తెప్పలచెమటనీఁటఁ దేలుటే చాలు
(॥ఏలే॥)
దగ్గరి రా నేనోప తప్పించుకొననోప
తగ్గుముగ్గనేనిపొటి తరగులే చాలు
వొగ్గి తనవిడె మొల్ల వొగరొగరననొల్ల
సిగ్గువడ్డ చెక్కుచేతిచింతలే చాలు
(॥ఏలే॥)
మంతనమాడ నేనొల్ల మర్మము చొక్కించనొల్ల
వంతుకు తాఁ గూడేటివరుసే చాలు
కాంతుఁడు శ్రీ వేంకటాద్రి కడపరాయఁడు నేఁడు
పంతమిచ్చి నన్నుఁ గూడె భాగ్యమాయఁ జాలును
(||pallavi||)
ele yiṁtesisem̐ta yīm̐tā mom̐tā
veḽa vachchinadām̐kā vĕragule sālu
(||ele||)
tappaga sūḍavĕradu talavaṁchugo vĕradu
appaḍappaḍi suddulu avĕsālu
kappuramu laṁṭanela kām̐kalam̐ bŏralanela
tĕppalasĕmaḍanīm̐ṭam̐ deluḍe sālu
(||ele||)
daggari rā nenoba tappiṁchugŏnanoba
taggumugganenibŏḍi taragule sālu
vŏggi tanaviḍĕ mŏlla vŏgarŏgarananŏlla
sigguvaḍḍa sĕkkusedisiṁtale sālu
(||ele||)
maṁtanamāḍa nenŏlla marmamu sŏkkiṁchanŏlla
vaṁtugu tām̐ gūḍeḍivaruse sālu
kāṁtum̐ḍu śhrī veṁkaḍādri kaḍabarāyam̐ḍu nem̐ḍu
paṁtamichchi nannum̐ gūḍĕ bhāgyamāyam̐ jālunu