ఏలే యింత పగటు యెరుఁగుకోవే నన్ను
(॥పల్లవి॥)
ఏలే యింత పగటు యెరుఁగుకోవే నన్ను
మేలుదాన మోదలనే మిక్కిలి నీతనికి
(॥ఏలే॥)
ననుపుదానఁగనక నవ్వితి నాపతితోడ
కొనచూపుల నీవేమి కొచ్చి చూచేవే
చనవు నా కిచ్చినాఁడు సరసము నే నాడితి
పని గద్దా నీకేమైనా పంతాలు చూపేవు
(॥ఏలే॥)
చుట్టపు వరుసలను సుద్దు లడిగే నాతని
కట్టఁగడ నుండి యేల కాఁతాళించేవే
గుట్టుసేయ నిఁకనేల కూడును మాఇద్దరికి
బట్టబయ లీఁదఁగాను ప(ఫ?) లమేమి నీకు
(॥ఏలే॥)
వరుసఁ గూచుండి నేను సారెఁ బాదా లొత్తఁగాను
గరిమల నీవేల కాఁక రేఁగేవే
ఇరవై శ్రీ వేంకటేశుఁ డిన్నిటాను ని(న?) న్ను నేలె
శిరసు వంచుక యెంత సిగ్గువడేలే
(||pallavi||)
ele yiṁta pagaḍu yĕrum̐gugove nannu
meludāna modalane mikkili nīdanigi
(||ele||)
nanubudānam̐ganaga navvidi nābadidoḍa
kŏnasūbula nīvemi kŏchchi sūseve
sanavu nā kichchinām̐ḍu sarasamu ne nāḍidi
pani gaddā nīgemainā paṁtālu sūbevu
(||ele||)
suṭṭabu varusalanu suddu laḍige nādani
kaṭṭam̐gaḍa nuṁḍi yela kām̐tāḽiṁcheve
guṭṭuseya nim̐kanela kūḍunu māiddarigi
baṭṭabaya līm̐dam̐gānu pa(pha?) lamemi nīgu
(||ele||)
varusam̐ gūsuṁḍi nenu sārĕm̐ bādā lŏttam̐gānu
garimala nīvela kām̐ka rem̐geve
iravai śhrī veṁkaḍeśhum̐ ḍinniḍānu ni(na?) nnu nelĕ
śhirasu vaṁchuga yĕṁta sigguvaḍele