Ele tanagu naagu nedimaadale nannu

ఏలే తనకు నాకు నేటిమాటలే నన్ను
Language

(॥పల్లవి॥)
ఏలే తనకు నాకు నేటిమాటలే నన్ను
దేలించి యెడమాటాడే తెరవతోడఁ గాకా

(॥ఏలే॥)
లేవే నేఁ బిలిచితే లెక్క సేసీనా తాను
సావివోయి వుమినాకీ చవుతమా యింక
వావాతఁ దాను నేను వాదించితే నవ్వరా
వేవేలునాయఁ బోయ వెనకకే పనుల

(॥ఏలే॥)
ఔనే తనకూ నాకు నంతపొందా తిట్టీని
మానిపండ్లు రాలితేను మానికిందనే
తా నొకటీ నే నొకటీ తలపోఁతలా యింక
నానాఁటిమోహము లెల్లా నామువేసీఁ గాకా

(॥ఏలే॥)
వద్దే నాతో నింక వట్టి వట్టి సరసము
అద్దో ముంజేతికంకణాన కద్దమా యింక
గద్దించి శ్రీవేంకటాద్రికడపరాయఁడు గూడె
పొద్దు వొద్దు వింతలును భోగములే కాకా

(||pallavi||)
ele tanagu nāgu neḍimāḍale nannu
deliṁchi yĕḍamāḍāḍe tĕravadoḍam̐ gāgā

(||ele||)
leve nem̐ biliside lĕkka sesīnā tānu
sāvivoyi vumināgī savudamā yiṁka
vāvādam̐ dānu nenu vādiṁchide navvarā
vevelunāyam̐ boya vĕnagage panula

(||ele||)
aune tanagū nāgu naṁtabŏṁdā tiṭṭīni
mānibaṁḍlu rālidenu mānigiṁdane
tā nŏgaḍī ne nŏgaḍī talabom̐talā yiṁka
nānām̐ṭimohamu lĕllā nāmuvesīm̐ gāgā

(||ele||)
vadde nādo niṁka vaṭṭi vaṭṭi sarasamu
addo muṁjedigaṁkaṇāna kaddamā yiṁka
gaddiṁchi śhrīveṁkaḍādrigaḍabarāyam̐ḍu gūḍĕ
pŏddu vŏddu viṁtalunu bhogamule kāgā