ఏలే రమణునికి నివి గొన్నిరోఁతలా
(॥పల్లవి॥)
ఏలే రమణునికి నివి గొన్నిరోఁతలా
పోల బొంకనైన రాదా పోది సేయవలెనా
(॥ఏలే॥)
చెదరెఁ బతికురులు చెరుగరాదా మీరు
అదివో చూచినవారు ఆడవలెనా
తుద చెమరించెఁబో తుడువరాదా మీరు
సుదతు లీతనికాఁక చూచి తిట్టవలేనా
(॥ఏలే॥)
పులకించెఁబో మేను పుప్పొడైనాఁ జల్లరాదా
నలువంకఁ గన్నవారు నవ్వవలెనా
తెలిగన్ను లాయఁబో తెరయైనా వేయరాదా
పలుమారు నతనిమై పచ్చిదోఁచవలెనా
(॥ఏలే॥)
కడురతి నలనేఁబో కప్పురమైనా నీరాదా
కడవా రీతనిచేఁత కానవలెనా
అడరి శ్రీవేంకటేశుఁ డందులోనె నన్నుఁ గూడె
బడలిక వాపరాదా పైపైనే వలెనా
(||pallavi||)
ele ramaṇunigi nivi gŏnnirom̐talā
pola bŏṁkanaina rādā podi seyavalĕnā
(||ele||)
sĕdarĕm̐ badigurulu sĕrugarādā mīru
adivo sūsinavāru āḍavalĕnā
tuda sĕmariṁchĕm̐bo tuḍuvarādā mīru
sudadu līdanigām̐ka sūsi tiṭṭavalenā
(||ele||)
pulagiṁchĕm̐bo menu puppŏḍainām̐ jallarādā
naluvaṁkam̐ gannavāru navvavalĕnā
tĕligannu lāyam̐bo tĕrayainā veyarādā
palumāru nadanimai pachchidom̐savalĕnā
(||ele||)
kaḍuradi nalanem̐bo kappuramainā nīrādā
kaḍavā rīdanisem̐ta kānavalĕnā
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍaṁdulonĕ nannum̐ gūḍĕ
baḍaliga vābarādā paibaine valĕnā