Ele nishtooramu limta yemigattugomti vimdu

ఏలే నిష్టూరము లింత యేమిగట్టుకొంటి విందు
Language

(॥పల్లవి॥)
ఏలే నిష్టూరము లింత యేమిగట్టుకొంటి విందు
గాలిఁబోయే వాసనలు గంటుగట్టె నందురా

(॥॥)
అన్నువ నీమోము చూపి అంతలోనే దాఁచేవేమే
పున్నమ చందురుఁడైనా పోడొకరాత్రి
తిన్నని గుబ్బలకు నాదిష్టి దాఁకెనంటాఁ గప్పి
యెన్నఁగ దిక్కులఁ గొండ కెండదాఁకీ నందురా

(॥॥)
నవ్వునవ్వి కొంతగొంత నాతో దాఁచే విదియేమే
పువ్వువంటివెన్నెలైనాఁ బోదొకవేళ
జవ్వనముపైరు విత్తి చాఁచి చేయిదీసేవేమే
మువ్వానఁ బారిననీరు మగుడించే నందురా

(॥॥)
కోరి నాతో వచ్చేనని కొంకి ఇట్టేబొంకితివి
ఆరునెల్లు గోయిల కూఁతైన నిజము
వేరులేక శ్రీవేంకటవిభుఁడ నేఁ గూడితిని
నారువోసి వలపులు నాటుకొనె నందురా

(||pallavi||)
ele niṣhṭūramu liṁta yemigaṭṭugŏṁṭi viṁdu
gālim̐boye vāsanalu gaṁṭugaṭṭĕ naṁdurā

(||||)
annuva nīmomu sūbi aṁtalone dām̐seveme
punnama saṁdurum̐ḍainā poḍŏgarātri
tinnani gubbalagu nādiṣhṭi dām̐kĕnaṁṭām̐ gappi
yĕnnam̐ga dikkulam̐ gŏṁḍa kĕṁḍadām̐kī naṁdurā

(||||)
navvunavvi kŏṁtagŏṁta nādo dām̐se vidiyeme
puvvuvaṁṭivĕnnĕlainām̐ bodŏgaveḽa
javvanamubairu vitti sām̐si seyidīseveme
muvvānam̐ bārinanīru maguḍiṁche naṁdurā

(||||)
kori nādo vachchenani kŏṁki iṭṭebŏṁkidivi
ārunĕllu goyila kūm̐taina nijamu
verulega śhrīveṁkaḍavibhum̐ḍa nem̐ gūḍidini
nāruvosi valabulu nāḍugŏnĕ naṁdurā