ఏలే మన సుద్దులు యెఱిఁగినవే కావా
(॥పల్లవి॥)
ఏలే మన సుద్దులు యెఱిఁగినవే కావా
యీలాగు అలుక నీ కింత చెల్లునా
(॥ఏలే॥)
వాలుఁజూపు నామీఁద వంచితే నేమాయ నీకు
నాలిగా సెలవిఁ గొంత నవ్వితే నేమీ
ఆలించి వొకమాట ఆడితే నేమాయ నీకు
వాలాయించి నేఁబట్టిన వద్దనఁగఁ జెల్లునా
(॥ఏలే॥)
జట్టిగొని నాపైఁ జేయిచాఁచితే నేమాయ నీకు
గుట్టుతో నామంచముపైఁ గూచుంటే నేమీ
వుట్టివడి నాకతలు వూఁకొంటే నేమాయ నీకు
అట్టె నేఁ గాఁగిలించితే నౌఁగాదనఁగలవా
(॥ఏలే॥)
పొత్తుకు వచ్చినాతో బోఁదైతే నేమాయ నీకు
హత్తి రతిఁ దనిపితే నందుకూ నేమి
బత్తితో శ్రీవేంకటాద్రిపతి నేనే బుజ్జగించి
చిత్తమురాఁ గలసితి సిగ్గు లిఁకనేటికి
(||pallavi||)
ele mana suddulu yĕṟim̐ginave kāvā
yīlāgu aluga nī kiṁta sĕllunā
(||ele||)
vālum̐jūbu nāmīm̐da vaṁchide nemāya nīgu
nāligā sĕlavim̐ gŏṁta navvide nemī
āliṁchi vŏgamāḍa āḍide nemāya nīgu
vālāyiṁchi nem̐baṭṭina vaddanam̐gam̐ jĕllunā
(||ele||)
jaṭṭigŏni nābaim̐ jeyisām̐side nemāya nīgu
guṭṭudo nāmaṁchamubaim̐ gūsuṁṭe nemī
vuṭṭivaḍi nāgadalu vūm̐kŏṁṭe nemāya nīgu
aṭṭĕ nem̐ gām̐giliṁchide naum̐gādanam̐galavā
(||ele||)
pŏttugu vachchinādo bom̐daide nemāya nīgu
hatti radim̐ danibide naṁdugū nemi
battido śhrīveṁkaḍādribadi nene bujjagiṁchi
sittamurām̐ galasidi siggu lim̐kaneḍigi