ఏలే మా ముందరనే యింత సేసే వింతెకాక
(॥పల్లవి॥)
ఏలే మా ముందరనే యింత సేసే వింతెకాక
మీలోనే మీరైతే మెచ్చే కాదా
(॥ఏలే॥)
మునుఁగు దీసి నీమోము చూచి నవ్వెనఁటా
కొసరి యాతని నేల కోపగించేవే
వనమై తనకు నీవు వదినె వంటాఁ గాక
యెసఁగి వింత వాఁడై తే నింత సేసీనా
(॥ఏలే॥)
పయ్యదకొంగు వట్టి బలిమిఁ బెనఁగెనంటా
నెయ్యాన నాతని కేల నింద వేసేవే
వొయ్యనె యిద్దరికిని వొక్కకొలమంటాఁ గాక
చెయ్యార మారుజాతైతే చెనక వచ్చీనా
(॥ఏలే॥)
ముందు గాఁగిలించి పట్టి మోవి గంటి సేసెనంటా
అందపు శ్రీవేంకటేశు నాన వెట్టేవు
చందాన నాతఁడు గూడె నీవలె చనవు గద్దంటాఁగాక
యిందరిని నీవలె నింత మెచ్చీనా
(||pallavi||)
ele mā muṁdarane yiṁta sese viṁtĕgāga
mīlone mīraide mĕchche kādā
(||ele||)
munum̐gu dīsi nīmomu sūsi navvĕnam̐ṭā
kŏsari yādani nela kobagiṁcheve
vanamai tanagu nīvu vadinĕ vaṁṭām̐ gāga
yĕsam̐gi viṁta vām̐ḍai te niṁta sesīnā
(||ele||)
payyadagŏṁgu vaṭṭi balimim̐ bĕnam̐gĕnaṁṭā
nĕyyāna nādani kela niṁda veseve
vŏyyanĕ yiddarigini vŏkkagŏlamaṁṭām̐ gāga
sĕyyāra mārujādaide sĕnaga vachchīnā
(||ele||)
muṁdu gām̐giliṁchi paṭṭi movi gaṁṭi sesĕnaṁṭā
aṁdabu śhrīveṁkaḍeśhu nāna vĕṭṭevu
saṁdāna nādam̐ḍu gūḍĕ nīvalĕ sanavu gaddaṁṭām̐gāga
yiṁdarini nīvalĕ niṁta mĕchchīnā