ఏలే ఆఁటదానికి యెమ్మెలింతేసి
(॥పల్లవి॥)
ఏలే ఆఁటదానికి యెమ్మెలింతేసి
వోలిఁ గడుగుట్టుతోడ నుండవలెఁగాక
(॥॥)
జవ్వాది యెంతవూసేవే చన్నులేల మూసేవే
చివ్వన నెన్నిచేఁతలు సేసేవే
నవ్వులేమి నవ్వేవే నలిఁ గొప్పేమి దువ్వేవే
రవ్వలాయ నీ వలపు రమణుని యెదుట
(॥॥)
సిగ్గులేల విడిచేవే చెమటేల తుడిచేవే
మొగ్గవిరు లిన్నేల ముడిచేవే
వొగ్గి కాలేల తొక్కేవే వూరకేల మొక్కేవే
యెగ్గులుఁ దప్పు లెవ్వరి నెంచని వాఁడతఁడు
(॥॥)
మఱి యెందాఁకాఁ బాడేవే మాటలెన్ని యాడేవే
గుఱిగాఁ గాఁగిట నెంత కూడేవే
యెఱుకతో శ్రీ వేంకటేశుఁడు నన్నిటు గూడె
మెఱసి యాతనికేల మేకులు సేసేవే
(||pallavi||)
ele ām̐ṭadānigi yĕmmĕliṁtesi
volim̐ gaḍuguṭṭudoḍa nuṁḍavalĕm̐gāga
(||||)
javvādi yĕṁtavūseve sannulela mūseve
sivvana nĕnnisem̐talu seseve
navvulemi navveve nalim̐ gŏppemi duvveve
ravvalāya nī valabu ramaṇuni yĕduḍa
(||||)
siggulela viḍiseve sĕmaḍela tuḍiseve
mŏggaviru linnela muḍiseve
vŏggi kālela tŏkkeve vūragela mŏkkeve
yĕggulum̐ dappu lĕvvari nĕṁchani vām̐ḍadam̐ḍu
(||||)
maṟi yĕṁdām̐kām̐ bāḍeve māḍalĕnni yāḍeve
guṟigām̐ gām̐giḍa nĕṁta kūḍeve
yĕṟugado śhrī veṁkaḍeśhum̐ḍu nanniḍu gūḍĕ
mĕṟasi yādanigela megulu seseve