Elayya maagu nidi yemtadosamu

ఏలయ్య మాకు నిది యెంతదోసము
Language

(॥పల్లవి॥)
ఏలయ్య మాకు నిది యెంతదోసము
యీ లీలఁ దప్పక చూచే వెఱఁగనివారమా

(॥ఏల॥)
పగటు గోపికలతోఁ బరచవై వుంటివని
జగమెల్ల నిన్నే చాటేరు
వెగటై నీవీనులనే వినవయ్య వీదివీది
నిగిడి నేఁడు గొత్తగా నేము గడించేమా

(॥ఏల॥)
యిక్కువ రాచకూఁతురు నెత్తుక వచ్చితివని
యెక్కడ చూచిన నీపై నిదే సుద్ది
నిక్కము దెలుసు కొంటే నీవు చేసిన చేఁతలే
వుక్కున మాకెంతగుండె వూరకే మిమ్మాడను

(॥ఏల॥)
మించుఁ దామెరలొ సతి మెడఁగట్టుకొంటివని
యెంచేరు కొలువులోన యిదే దిష్టము
కొంచక శ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టె
మంచముపైఁ గళదేరీ మఱి యేఁటిపనులు

(||pallavi||)
elayya māgu nidi yĕṁtadosamu
yī līlam̐ dappaga sūse vĕṟam̐ganivāramā

(||ela||)
pagaḍu gobigaladom̐ barasavai vuṁṭivani
jagamĕlla ninne sāḍeru
vĕgaḍai nīvīnulane vinavayya vīdivīdi
nigiḍi nem̐ḍu gŏttagā nemu gaḍiṁchemā

(||ela||)
yikkuva rāsagūm̐turu nĕttuga vachchidivani
yĕkkaḍa sūsina nībai nide suddi
nikkamu dĕlusu kŏṁṭe nīvu sesina sem̐tale
vukkuna māgĕṁtaguṁḍĕ vūrage mimmāḍanu

(||ela||)
miṁchum̐ dāmĕralŏ sadi mĕḍam̐gaṭṭugŏṁṭivani
yĕṁcheru kŏluvulona yide diṣhṭamu
kŏṁchaga śhrīveṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
maṁchamubaim̐ gaḽaderī maṟi yem̐ṭibanulu