(॥పల్లవి॥)
ఏలయ్య మాతోడి యేలాటాలు
కేలెత్తి మొక్కేము కృపఁ జూడవయ్యా
(॥ఏల॥)
చల్లలమ్మేవారిసంగడి నుండఁగ
యెల్లవారు నిన్ను నేమందురు
గొల్లఁడాయ రాచకొడుకు వీఁడంటా
తొల్లే మధురలో దూరిరి నిన్ను
(॥ఏల॥)
ఆలఁగాపరై అడవి నుండఁగ
యీలీలఁ బౌరులు యేమందురు
బాలుఁడాయ పరబ్రహ్మము వీఁడంటా
పోలిమితోఁ గరిపురజను లనిరి
(॥ఏల॥)
బండిబోయిఁ(యఁ?) డవై పౌఁజులలో నుండఁగ
యిండువిండ్లవారేమందురు
దండి శ్రీవేంకటోత్తముఁడాయ వీఁడంటా
నిండుఁదిరుపతినిలయము నగిరి
(||pallavi||)
elayya mādoḍi yelāḍālu
kelĕtti mŏkkemu kṛpam̐ jūḍavayyā
(||ela||)
sallalammevārisaṁgaḍi nuṁḍam̐ga
yĕllavāru ninnu nemaṁduru
gŏllam̐ḍāya rāsagŏḍugu vīm̐ḍaṁṭā
tŏlle madhuralo dūriri ninnu
(||ela||)
ālam̐gābarai aḍavi nuṁḍam̐ga
yīlīlam̐ baurulu yemaṁduru
bālum̐ḍāya parabrahmamu vīm̐ḍaṁṭā
polimidom̐ gariburajanu laniri
(||ela||)
baṁḍiboyim̐(yam̐?) ḍavai paum̐julalo nuṁḍam̐ga
yiṁḍuviṁḍlavāremaṁduru
daṁḍi śhrīveṁkaḍottamum̐ḍāya vīm̐ḍaṁṭā
niṁḍum̐dirubadinilayamu nagiri