ఏలయ్య మా కంతేసి యెమ్మెలు నీతో
(॥పల్లవి॥)
ఏలయ్య మా కంతేసి యెమ్మెలు నీతో
నా లావుకలిములు నన్ను నీవెఱఁగవా
(॥ఏల॥)
పంతము నీతో నాడేపలుకులవారమా
వంతుకు నీసేవసేసేవారముగాక
జంతలవలెను నిన్ను సాదించేవారమా
దొంతిఁ గొంగువట్టితేను తోసేవారముగాక
(॥ఏల॥)
అచ్చలాన నీతోడ నలిగేటి వారమా
వచ్చి తలవంచుకుండేవారముగాక
కొచ్చి కొచ్చి నీతోడ కొపగించేవారమా
తుచ్చపుగోర నూఁదితే దూరేవారముగాక
(॥ఏల॥)
చేరి నన్నుఁ గూడఁగాను చేయివట్టేవారమా
వారించి సిగ్గులు వడేవారముగాక
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నేరమివట్టేవారమా నీవారముగాక
(||pallavi||)
elayya mā kaṁtesi yĕmmĕlu nīdo
nā lāvugalimulu nannu nīvĕṟam̐gavā
(||ela||)
paṁtamu nīdo nāḍebalugulavāramā
vaṁtugu nīsevasesevāramugāga
jaṁtalavalĕnu ninnu sādiṁchevāramā
dŏṁtim̐ gŏṁguvaṭṭidenu tosevāramugāga
(||ela||)
achchalāna nīdoḍa naligeḍi vāramā
vachchi talavaṁchuguṁḍevāramugāga
kŏchchi kŏchchi nīdoḍa kŏbagiṁchevāramā
tuchchabugora nūm̐dide dūrevāramugāga
(||ela||)
seri nannum̐ gūḍam̐gānu seyivaṭṭevāramā
vāriṁchi siggulu vaḍevāramugāga
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
neramivaṭṭevāramā nīvāramugāga