ఎలయింపుఁ జేఁతల నీ వెంత సేసేవు
(॥పల్లవి॥)
ఎలయింపుఁ జేఁతల నీ వెంత సేసేవు
చలములు సాదించక చనవియ్యరాదా
(॥ఎల॥)
మాటలకుఁ దలపెట్టి మనసెల్లా భ్రమఇంచి
అఁటదాని వింతయేల అలఇంచేవు
నీటున బుసకొట్టుచు నిలుచుండెప్పటనుండి
గాఁటానఁ బానుపునను కలయఁగరాదా
(॥ఎల॥)
బట్టబయలు నవ్వించి పరాకులు వుట్టించి
చుట్టమైన యీపెనేల సూడువట్టేవు
దట్టపుఁ జెమటతోడ తప్పకచూచీ నిన్ను
నెట్టుకొన్న రతులఁ దనివిసేయరాదా
(॥ఎల॥)
చేతులు మీఁదవేసి చిమ్మిరేఁచి వలపుల
కాతర మీకె కంటించి కాఁగిలించేవు
యీతల శ్రీవేంకటేశ యెనసి నీకింతి మొక్కీ
రాతిరిఁబగలు నిట్టె రమియించరాదా
(||pallavi||)
ĕlayiṁpum̐ jem̐tala nī vĕṁta sesevu
salamulu sādiṁchaga sanaviyyarādā
(||ĕla||)
māḍalagum̐ dalabĕṭṭi manasĕllā bhrama̮iṁchi
am̐ṭadāni viṁtayela ala̮iṁchevu
nīḍuna busagŏṭṭusu nilusuṁḍĕppaḍanuṁḍi
gām̐ṭānam̐ bānubunanu kalayam̐garādā
(||ĕla||)
baṭṭabayalu navviṁchi parāgulu vuṭṭiṁchi
suṭṭamaina yībĕnela sūḍuvaṭṭevu
daṭṭabum̐ jĕmaḍadoḍa tappagasūsī ninnu
nĕṭṭugŏnna radulam̐ daniviseyarādā
(||ĕla||)
sedulu mīm̐davesi simmirem̐si valabula
kādara mīgĕ kaṁṭiṁchi kām̐giliṁchevu
yīdala śhrīveṁkaḍeśha yĕnasi nīgiṁti mŏkkī
rādirim̐bagalu niṭṭĕ ramiyiṁcharādā