ఎలయింపుఁ జేఁత లివి యెందాఁకానే
(॥పల్లవి॥)
ఎలయింపుఁ జేఁత లివి యెందాఁకానే
కలయిక రతులఁ జొక్కంగఁ జేయఁగదవే
(॥ఎల॥)
సన్నలనె పతితోడ సాములేమి సేసేవే
కన్నుల చూపుల నెంత కరఁగించేవే
చిన్ని పెదవుల మీఁది సిగ్గు లెంత చల్లేవే
పన్ని పానుపుపైనుండి పాదాలొత్తఁగదవే
(॥ఎల॥)
బొమ్మలజంకెనలనే పొందులేల జరపేవే
కుమ్మరింపుఁజెనుటల గోరఁ జిమ్మేవే
నిమ్మపంటివాట్లను నేరుపెంత చూపేవే
యిమ్మలఁ గప్పరవిడె మిప్ప డియ్యఁగదవే
(॥ఎల॥)
యెదరెదురనె సారె యేలాటా లేలాడేవే
ముదురుఁదమకమే మూసిదాఁచేవే
ఇదివో శ్రీ వేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
సదమదముగ సరసము లాడఁగదవే
(||pallavi||)
ĕlayiṁpum̐ jem̐ta livi yĕṁdām̐kāne
kalayiga radulam̐ jŏkkaṁgam̐ jeyam̐gadave
(||ĕla||)
sannalanĕ padidoḍa sāmulemi seseve
kannula sūbula nĕṁta karam̐giṁcheve
sinni pĕdavula mīm̐di siggu lĕṁta salleve
panni pānububainuṁḍi pādālŏttam̐gadave
(||ĕla||)
bŏmmalajaṁkĕnalane pŏṁdulela jarabeve
kummariṁpum̐jĕnuḍala goram̐ jimmeve
nimmabaṁṭivāṭlanu nerubĕṁta sūbeve
yimmalam̐ gapparaviḍĕ mippa ḍiyyam̐gadave
(||ĕla||)
yĕdarĕduranĕ sārĕ yelāḍā lelāḍeve
mudurum̐damagame mūsidām̐seve
idivo śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
sadamadamuga sarasamu lāḍam̐gadave