Elayimchi javaraali nemta sesevu

ఎలయించి జవరాలి నెంత సేసేవు
Language

(॥పల్లవి॥)
ఎలయించి జవరాలి నెంత సేసేవు
వలవని వైరాలు వారింతువు రావయ్యా

(॥ఎల॥)
వెలఁది నిన్నుఁబాసి విరహాన ముంజేతి
చిలుకఁ బారఁదోలె చిగురుఁ దిట్టె
పొలసిన కోవిలల పూఁచి వుంటవింటవేసి
చెలఁగి యీపెకు బుద్ది చెప్పదువు రావయ్యా

(॥ఎల॥)
వెట్టవిరి నీ వాడకు విచ్చేయని కాఁతాళాన
చల్లగాలిఁ గోపగించె జాజులు గోసె
పల్లదానఁ దుమ్మిదలపై సంపెఁగలు చల్లె
మల్లాడి యీపె కినుక మాన్పుదువు రావయ్యా

(॥ఎల॥)
తమకించి నీవు వచ్చుదాఁకా వేగిరమై
కమలము లెండఁబెట్టె కంతు సాధించె
మమతతో గూడితివి మన్నించి శ్రీ వేంకటేశ
ప్రమదాన నీకె నొడఁబరతురు రావయ్యా

(||pallavi||)
ĕlayiṁchi javarāli nĕṁta sesevu
valavani vairālu vāriṁtuvu rāvayyā

(||ĕla||)
vĕlam̐di ninnum̐bāsi virahāna muṁjedi
silugam̐ bāram̐dolĕ sigurum̐ diṭṭĕ
pŏlasina kovilala pūm̐si vuṁṭaviṁṭavesi
sĕlam̐gi yībĕgu buddi sĕppaduvu rāvayyā

(||ĕla||)
vĕṭṭaviri nī vāḍagu vichcheyani kām̐tāḽāna
sallagālim̐ gobagiṁchĕ jājulu gosĕ
palladānam̐ dummidalabai saṁpĕm̐galu sallĕ
mallāḍi yībĕ kinuga mānpuduvu rāvayyā

(||ĕla||)
tamagiṁchi nīvu vachchudām̐kā vegiramai
kamalamu lĕṁḍam̐bĕṭṭĕ kaṁtu sādhiṁchĕ
mamadado gūḍidivi manniṁchi śhrī veṁkaḍeśha
pramadāna nīgĕ nŏḍam̐baraduru rāvayyā