Elayimcheem daaninnidaa nemi sedune

ఎలయించీఁ దానిన్నిటా నేమి సేతునే
Language

(॥పల్లవి॥)
ఎలయించీఁ దానిన్నిటా నేమి సేతునే
యెలుఁగెత్తి దూరరాదు ఏమి సేతునే

(॥ఎల॥)
వింతగా వేఁడుకొనీని వెనకటి చేఁతలకు
యెంతైనాఁ గొల్పదు మన సేమిసేతునే
కాంతుఁడు తా నిన్నిటాను కడు మీరి వున్నవాఁడు
యింతులిందరు నున్నారు యేమి సేతునే

(॥ఎల॥)
ముట్టి తా నన్నుఁ బిల్చీని మొన్ననెల్లా రానందుకు
యిట్టే కోపము మానదు యేమి సేతునే
ఱట్టిడి తా నింతలో నాఱడీరసము చూపీని
యెట్టికేలకుఁ గంటిని యేమి సేతునే

(॥ఎల॥)
కదిసి తాఁ గాఁగిలించి కడవారిఁ బొందినందు-
కెదుట శ్రీవేంకటేశు నేమిసేతునే
అదన నన్నేలుకొనె నన్నిటాను మన్నించీ-
నిదివో నే మరిగితి నేమి సేతునే

(||pallavi||)
ĕlayiṁchīm̐ dāninniḍā nemi sedune
yĕlum̐gĕtti dūrarādu emi sedune

(||ĕla||)
viṁtagā vem̐ḍugŏnīni vĕnagaḍi sem̐talagu
yĕṁtainām̐ gŏlbadu mana semisedune
kāṁtum̐ḍu tā ninniḍānu kaḍu mīri vunnavām̐ḍu
yiṁtuliṁdaru nunnāru yemi sedune

(||ĕla||)
muṭṭi tā nannum̐ bilsīni mŏnnanĕllā rānaṁdugu
yiṭṭe kobamu mānadu yemi sedune
ṟaṭṭiḍi tā niṁtalo nāṟaḍīrasamu sūbīni
yĕṭṭigelagum̐ gaṁṭini yemi sedune

(||ĕla||)
kadisi tām̐ gām̐giliṁchi kaḍavārim̐ bŏṁdinaṁdu-
kĕduḍa śhrīveṁkaḍeśhu nemisedune
adana nannelugŏnĕ nanniḍānu manniṁchī-
nidivo ne marigidi nemi sedune