Elayimchee saaregu ninnevvado kaani

ఎలయించీ సారెకు నిన్నెవ్వతో కాని
Language

(॥పల్లవి॥)
ఎలయించీ సారెకు నిన్నెవ్వతో కాని
వలపులు చల్లీని వాడు దేరిచీని

(॥॥)
కలువల వేసి సతి గక్కన నీవు చూచితే
మొలకసన్నలనే మోవి చూపీని
అలరి చదురంగములాడేపరాకున నుంటే
యెలుఁ గెత్తి పాటపాడి యెచ్చరించీని

(॥॥)
యింతి చన్నుల నిన్నొత్తి ఇవ్వలిమోము నీవైతే
అంతలోనే కన్నుల నీకటు మొక్కీని
పంతానఁ బానుపుమీఁ దఁ బవ్వళించి నీవుండితే
చెంతనుండి యెరుకలు సేయుచు నవ్వీని

(॥॥)
నిమ్మపండు గానుకిచ్చి నీవు చేతనుందికొంటే
కమ్ముక నిన్నింతలోనే కాఁగిలించీని
నెమ్మది శ్రీవేంకటేశ నే నల మేలుమంగను
కమ్మర ననుఁ గూడితే కందువ చెప్పీని

(||pallavi||)
ĕlayiṁchī sārĕgu ninnĕvvado kāni
valabulu sallīni vāḍu derisīni

(||||)
kaluvala vesi sadi gakkana nīvu sūside
mŏlagasannalane movi sūbīni
alari saduraṁgamulāḍebarāguna nuṁṭe
yĕlum̐ gĕtti pāḍabāḍi yĕchchariṁchīni

(||||)
yiṁti sannula ninnŏtti ivvalimomu nīvaide
aṁtalone kannula nīgaḍu mŏkkīni
paṁtānam̐ bānubumīm̐ dam̐ bavvaḽiṁchi nīvuṁḍide
sĕṁtanuṁḍi yĕrugalu seyusu navvīni

(||||)
nimmabaṁḍu gānugichchi nīvu sedanuṁdigŏṁṭe
kammuga ninniṁtalone kām̐giliṁchīni
nĕmmadi śhrīveṁkaḍeśha ne nala melumaṁganu
kammara nanum̐ gūḍide kaṁduva sĕppīni