Elayimche amdulagu nevvaramaidimeni

ఎలయించే అందులకు నెవ్వరమైతిమేని
Language

(॥పల్లవి॥)
ఎలయించే అందులకు నెవ్వరమైతిమేని
పొలసి పూచినమీఁద పూఁపలయ్యీఁ గాని

(॥ఎల॥)
కందువలు నీకుఁ జూపి కాఁకలు మతిలో నించి
సందడిఁ బెట్టెఁగా ఆపె సారె సారెకు
అందుకొని నన్నుఁ జూడు మాపెకంటె భ్రమఇంచి
విందు వెట్టి కాలు దొక్కి వెంట దిప్పే నిన్నును

(॥ఎల॥)
కొంగువట్టి తీసి నిన్ను కొలువులోపల నవ్వి
అంగడిఁ బెట్టెఁగా వల కాపె తొలుతె
సంగడిఁ జూడు నానేర్పు సరి నాపె వలెనే
అంగమంటి మీఁద మీఁద నాసలు రేఁచేను

(॥ఎల॥)
కావరించి మొక్కు మొక్కి కాఁగిలించుకొని మెచ్చి
చేవదేర నాపె సేవ సేసెఁగా నీకు
శ్రీ వేంకటేశ నన్నుఁజేరి కూడితివి చూడు
వేవే లాపెకంటె వెల్లావిరి సేసే నిపుడు

(||pallavi||)
ĕlayiṁche aṁdulagu nĕvvaramaidimeni
pŏlasi pūsinamīm̐da pūm̐palayyīm̐ gāni

(||ĕla||)
kaṁduvalu nīgum̐ jūbi kām̐kalu madilo niṁchi
saṁdaḍim̐ bĕṭṭĕm̐gā ābĕ sārĕ sārĕgu
aṁdugŏni nannum̐ jūḍu mābĕgaṁṭĕ bhrama̮iṁchi
viṁdu vĕṭṭi kālu dŏkki vĕṁṭa dippe ninnunu

(||ĕla||)
kŏṁguvaṭṭi tīsi ninnu kŏluvulobala navvi
aṁgaḍim̐ bĕṭṭĕm̐gā vala kābĕ tŏludĕ
saṁgaḍim̐ jūḍu nānerbu sari nābĕ valĕne
aṁgamaṁṭi mīm̐da mīm̐da nāsalu rem̐senu

(||ĕla||)
kāvariṁchi mŏkku mŏkki kām̐giliṁchugŏni mĕchchi
sevadera nābĕ seva sesĕm̐gā nīgu
śhrī veṁkaḍeśha nannum̐jeri kūḍidivi sūḍu
veve lābĕgaṁṭĕ vĕllāviri sese nibuḍu