(॥పల్లవి॥)
ఏలవయ్య యింతుల నెందరినైనా
మేలిమివాఁడవు నీకు మేకులు బాఁతే(తా?)
(॥ఏల॥)
వేసాలవాఁడవు వేగిరకాఁడవు
వాసులసతులు వలవక మానేరా
వేసరక సేసేవు వినయాలెవ్వరికైనా
ఆసోదకాఁడవు నీకు నాండ్లుఁ బాతా
(॥ఏల॥)
యిచ్చకము నేరుతువు యిన్నిటాఁ బరగితివి
అచ్చపుకాంతలు బ్రమయక మానేరా
పచ్చిదేర నిచ్చేవు బాసలెవ్వరికినైన
దిచ్చరివాఁడవు నీకు దేవుళ్ళు బాఁతా
(॥ఏల॥)
చేరి వరాలిత్తువు శ్రీ వేంకటేశుఁడవు
గారవపు నేము మరుగక మానేమా
సారెకు నీవొసగేవు చనవులెవ్వరికైనా
బీరపువాఁడవు నీవు పెండ్లికూఁతులు బాఁతా
(||pallavi||)
elavayya yiṁtula nĕṁdarinainā
melimivām̐ḍavu nīgu megulu bām̐te(tā?)
(||ela||)
vesālavām̐ḍavu vegiragām̐ḍavu
vāsulasadulu valavaga mānerā
vesaraga sesevu vinayālĕvvarigainā
āsodagām̐ḍavu nīgu nāṁḍlum̐ bādā
(||ela||)
yichchagamu neruduvu yinniḍām̐ baragidivi
achchabugāṁtalu bramayaga mānerā
pachchidera nichchevu bāsalĕvvariginaina
dichcharivām̐ḍavu nīgu devuḽḽu bām̐tā
(||ela||)
seri varālittuvu śhrī veṁkaḍeśhum̐ḍavu
gāravabu nemu marugaga mānemā
sārĕgu nīvŏsagevu sanavulĕvvarigainā
bīrabuvām̐ḍavu nīvu pĕṁḍligūm̐tulu bām̐tā