ఏలరా యింతవలపు యేమిబాఁతి నే నీకు
(॥పల్లవి॥)
ఏలరా యింతవలపు యేమిబాఁతి నే నీకు
సోలి నాపె నొరగేవు చొక్కనాథ లేలే
(॥ఏల॥)
పొలసితే నంతలోనే పొదిగి కాఁగిలించేవు
యెలుఁగించితే తలయెత్తి చూచేవు
తలఁకితే విరహాన దక్కి చీకటి దవ్వేవు
నలిరేఁగి దగ్గరితే నవ్వులు నవ్వేవు
(॥ఏల॥)
చక్కఁ బయ్యద వెట్టితే చాఁచేవు చేయి సారె
దిక్కులెల్లా సాదించి తెంకిచూపేవు
చొక్కి నే నేడనుండినా చొప్పులెత్తుక వచ్చేవు
పెక్కురతులనే నన్నుఁ బెనఁగఁజొచ్చేవు
(॥ఏల॥)
చేరఁబిలువకే వుంటే సిగ్గయినా విడిచేవు
గారవించినంతలోనే కాలుదొక్కేవు
వోరి శ్రీవేంకటగిరినుండి వచ్చికూడితివి
మేరతో నెలఁదలూరి మేటిచొక్కనాథా
(||pallavi||)
elarā yiṁtavalabu yemibām̐ti ne nīgu
soli nābĕ nŏragevu sŏkkanātha lele
(||ela||)
pŏlaside naṁtalone pŏdigi kām̐giliṁchevu
yĕlum̐giṁchide talayĕtti sūsevu
talam̐kide virahāna dakki sīgaḍi davvevu
nalirem̐gi daggaride navvulu navvevu
(||ela||)
sakkam̐ bayyada vĕṭṭide sām̐sevu seyi sārĕ
dikkulĕllā sādiṁchi tĕṁkisūbevu
sŏkki ne neḍanuṁḍinā sŏppulĕttuga vachchevu
pĕkkuradulane nannum̐ bĕnam̐gam̐jŏchchevu
(||ela||)
seram̐biluvage vuṁṭe siggayinā viḍisevu
gāraviṁchinaṁtalone kāludŏkkevu
vori śhrīveṁkaḍagirinuṁḍi vachchigūḍidivi
merado nĕlam̐dalūri meḍisŏkkanāthā