ఎలమి బలిమి సేసితి రిందు కాతనిఁ దెచ్చితి
(॥పల్లవి॥)
ఎలమి బలిమి సేసితి రిందు కాతనిఁ దెచ్చితి-
రాలరి తలఁపులెల్లా నాడనే వున్నవి
(॥ఎలమి॥)
బంటువలె నా చేతి బాద కున్నాడు గాని వా
రింటికి బొయ్యేటి ఆస ఇంకా నున్నాది
నంటున నీడ నుండేది నాటకము గాని యాపె
వెంట వెంట దిరిగాడే వేడుకే వున్నాది
(॥ఎలమి॥)
పొగరై యీతఁడు మాతోఁ బోందు సేసీఁ గాని యాపె
మొగము చూచేవలపు ముంచి వున్నది
జగము మెచ్చ నాపైఁ జెయి చాచె నింతే కానియాపె
దగిలి కాగిలించేటితమకమే వున్నది
(॥ఎలమి॥)
పాదుగా నాతోడ మీద బవళించె గాని యాపె
పాదాలకు మొక్కె యట్టి భ్రమవున్నది
ఆదరించెలమేల్మంగనని శ్రీవేంకటేశుఁడు
నాదెసై నిలిచి కూడె నవ్వు మోవి మీఁద నున్నది
(||pallavi||)
ĕlami balimi sesidi riṁdu kādanim̐ dĕchchidi-
rālari talam̐pulĕllā nāḍane vunnavi
(||ĕlami||)
baṁṭuvalĕ nā sedi bāda kunnāḍu gāni vā
riṁṭigi bŏyyeḍi āsa iṁkā nunnādi
naṁṭuna nīḍa nuṁḍedi nāḍagamu gāni yābĕ
vĕṁṭa vĕṁṭa dirigāḍe veḍuge vunnādi
(||ĕlami||)
pŏgarai yīdam̐ḍu mādom̐ boṁdu sesīm̐ gāni yābĕ
mŏgamu sūsevalabu muṁchi vunnadi
jagamu mĕchcha nābaim̐ jĕyi sāsĕ niṁte kāniyābĕ
dagili kāgiliṁcheḍidamagame vunnadi
(||ĕlami||)
pādugā nādoḍa mīda bavaḽiṁchĕ gāni yābĕ
pādālagu mŏkkĕ yaṭṭi bhramavunnadi
ādariṁchĕlamelmaṁganani śhrīveṁkaḍeśhum̐ḍu
nādĕsai nilisi kūḍĕ navvu movi mīm̐da nunnadi