(॥పల్లవి॥)
ఏలకో తలఁ పెక్కడ నుందో
నాలినే పోయ నడుమ మాటా యేలకో
(॥ఏలకో॥)
మొక్కులే మొక్కీ మొన్నటనుంటి
యిక్కడికి రాఁడు యిది యేమే తాను యాలకో
యెక్కె నా చల మిందయినఁ గొంత
పక్కన నే నవ్వఁ బాడిగాదూ యాలకో
(॥ఏలకో॥)
చెప్పరే మాట చెలులు మీరు
చిప్పిలిఁ దమ్మిచిత్తములోనా యాలకో
తప్పీనో నాతోఁ దా నన్న బాసా
తిప్పరాదు కడుఁదీపాయ వలపూ
(॥ఏలకో॥)
దగ్గరి వచ్చెఁ దా నింతలోనా
సిగ్గులు వీడె సెలవినవ్వి యాలకో
వెగ్గళించి శ్రీవేంకటవిభుఁడు
నిగ్గుదేరఁ గూడ నిట్టూర్పు నించీ యాలకో
(||pallavi||)
elago talam̐ pĕkkaḍa nuṁdo
nāline poya naḍuma māḍā yelago
(||elago||)
mŏkkule mŏkkī mŏnnaḍanuṁṭi
yikkaḍigi rām̐ḍu yidi yeme tānu yālago
yĕkkĕ nā sala miṁdayinam̐ gŏṁta
pakkana ne navvam̐ bāḍigādū yālago
(||elago||)
sĕppare māḍa sĕlulu mīru
sippilim̐ dammisittamulonā yālago
tappīno nādom̐ dā nanna bāsā
tipparādu kaḍum̐dībāya valabū
(||elago||)
daggari vachchĕm̐ dā niṁtalonā
siggulu vīḍĕ sĕlavinavvi yālago
vĕggaḽiṁchi śhrīveṁkaḍavibhum̐ḍu
nigguderam̐ gūḍa niṭṭūrbu niṁchī yālago