ఏలా యీ యనుమానము లింతి మనంబునఁ బాయని
(॥పల్లవి॥)
ఏలా యీ యనుమానము లింతి మనంబునఁ బాయని-
తాలిమి తప్పుఁ దెరువున దాఁగెఁ గదోయమ్మా
(॥ఏలా॥)
మాయపుమంటలు చల్లెడు మందమారుతము
పాయము దిరుగఁబారెడు పండుఁజందురుఁడు
కాయము తల్లడపరపెడు గండుగోయిలలు
యేయెడనోర్వదు చెలిలాగేలాగోయమ్మా
(॥ఏలా॥)
ఇంటఁ బుట్టిన యాతఁడే యింటఁ బుట్టిన యమ్ముల
యింటఁ బలుమారునేయఁగ నేమందునోయమ్మా
వింటఁ బాసిన శరముల వెంటఁ దగిలెడు నారిని
యంటిన మదనానలమిఁక నారుపరాదమ్మా
(॥ఏలా॥)
కొండలరాయఁడు చెలిచనుఁ గొండల నించిన గురుతులు
కొండుకచందురులైనవి కొత్తగదోయమ్మ
నిండిన విరహంబింతయు నేఁడిదె యమృతంబాయను
పండిన తమకము మేలై పలియించెనోయమ్మా
(||pallavi||)
elā yī yanumānamu liṁti manaṁbunam̐ bāyani-
tālimi tappum̐ dĕruvuna dām̐gĕm̐ gadoyammā
(||elā||)
māyabumaṁṭalu sallĕḍu maṁdamārudamu
pāyamu dirugam̐bārĕḍu paṁḍum̐jaṁdurum̐ḍu
kāyamu tallaḍabarabĕḍu gaṁḍugoyilalu
yeyĕḍanorvadu sĕlilāgelāgoyammā
(||elā||)
iṁṭam̐ buṭṭina yādam̐ḍe yiṁṭam̐ buṭṭina yammula
yiṁṭam̐ balumāruneyam̐ga nemaṁdunoyammā
viṁṭam̐ bāsina śharamula vĕṁṭam̐ dagilĕḍu nārini
yaṁṭina madanānalamim̐ka nārubarādammā
(||elā||)
kŏṁḍalarāyam̐ḍu sĕlisanum̐ gŏṁḍala niṁchina gurudulu
kŏṁḍugasaṁdurulainavi kŏttagadoyamma
niṁḍina virahaṁbiṁtayu nem̐ḍidĕ yamṛtaṁbāyanu
paṁḍina tamagamu melai paliyiṁchĕnoyammā