Elaa imkaam gosaranu innidaa taa jaanamdaunu

ఏలా ఇంకాఁ గొసరను ఇన్నిటా తా జాణఁడౌను
Language

(॥పల్లవి॥)
ఏలా ఇంకాఁ గొసరను ఇన్నిటా తా జాణఁడౌను
మేలుమేలు ఇన్నిటాను మెచ్చితి నేననరే

(॥ఏల॥)
కానుక నే నంపి తేను కమ్మటి మారుకుమారు
తానూఁ గప్పురమంపెఁ దగవేకదే
వీనులు చల్లఁగా వింటి వీడుకువీడాయను
మోనమున నప్పటిని మ్కొకితి నేననరే

(॥ఏల॥)
పూవుల నే వేసితేను పూఁచి తా మారుకుమారు
తావిజవ్వాదిని వేసె దగవే కదే
సావివోక వలపులు సరికిసరాయను
పోవులుగా తను నేఁ బొగడితిననరే

(॥ఏల॥)
అడరి నేఁ బిలిచితే నంతలో మారుకుమారు
తడయక వూఁకొనెఁ దగవే కదే
యెడయక శ్రీవేంకటేశుఁ డేలెఁ బొందాయను
నడుమ సరమరతికి నవ్వితి నేననరే

(||pallavi||)
elā iṁkām̐ gŏsaranu inniḍā tā jāṇam̐ḍaunu
melumelu inniḍānu mĕchchidi nenanare

(||ela||)
kānuga ne naṁpi tenu kammaḍi mārugumāru
tānūm̐ gappuramaṁpĕm̐ dagavegade
vīnulu sallam̐gā viṁṭi vīḍuguvīḍāyanu
monamuna nappaḍini mkŏgidi nenanare

(||ela||)
pūvula ne vesidenu pūm̐si tā mārugumāru
tāvijavvādini vesĕ dagave kade
sāvivoga valabulu sarigisarāyanu
povulugā tanu nem̐ bŏgaḍidinanare

(||ela||)
aḍari nem̐ biliside naṁtalo mārugumāru
taḍayaga vūm̐kŏnĕm̐ dagave kade
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ ḍelĕm̐ bŏṁdāyanu
naḍuma saramaradigi navvidi nenanare