ఏల యింతసేసేవు యింటికి రావే
(॥పల్లవి॥)
ఏల యింతసేసేవు యింటికి రావే
వేళవచ్చె నిఁకనైన విడెమందుకోవే
(॥ఏల॥)
వగరుఁబెదవులపై వులివచ్చినీమాఁటలు
చిగిరించి వలపులు చిమ్మిరేఁచీనే
తెగ నిండాఁజాఁచినతీగెసో గలచూపులు
తగిలి మర్మములంటి తమి పుట్టించీనే
(॥ఏల॥)
కలకలమనియేటికప్పురపునీనవ్వులు
తలఁపులో గుబ్బితిలి దైవారించీనే
పొలపు మిగిలినట్టిబొమ్మలనీజం కెనలు
తలకొని యాసాసలఁ దగిలించీనే
(॥ఏల॥)
చక్కఁదనములనీసరసపువిలాసాలు
వెక్కసపువేడుకలఁ జొక్కించీనే
ఇక్కడనె శ్రీవేంకటేశుఁడనైననాకు
దక్కితిని నీచేఁతలు తడఁబఱచీనె
(||pallavi||)
ela yiṁtasesevu yiṁṭigi rāve
veḽavachchĕ nim̐kanaina viḍĕmaṁdugove
(||ela||)
vagarum̐bĕdavulabai vulivachchinīmām̐ṭalu
sigiriṁchi valabulu simmirem̐sīne
tĕga niṁḍām̐jām̐sinadīgĕso galasūbulu
tagili marmamulaṁṭi tami puṭṭiṁchīne
(||ela||)
kalagalamaniyeḍigappurabunīnavvulu
talam̐pulo gubbidili daivāriṁchīne
pŏlabu migilinaṭṭibŏmmalanījaṁ kĕnalu
talagŏni yāsāsalam̐ dagiliṁchīne
(||ela||)
sakkam̐danamulanīsarasabuvilāsālu
vĕkkasabuveḍugalam̐ jŏkkiṁchīne
ikkaḍanĕ śhrīveṁkaḍeśhum̐ḍanainanāgu
dakkidini nīsem̐talu taḍam̐baṟasīnĕ