(॥పల్లవి॥)
ఏల యింత చలము యింతి నేను
తాలిమితో నుండఁగాను తమకించేనా
(॥ఏల॥)
మునుప నే నీకును మొక్కితి నే ననఁగానే
చెనకి చెనకి మరిఁ జేయివట్టేవా
పనివడి యిప్పుడిట్టె పంతమిచ్చితి ననఁగా
పెనఁగి చెలులచేతఁ బిలిపించేవా
(॥ఏల॥)
ఇదివో నే నీకును ఇచ్చకములాడఁగానే
పదిరి నావొడివట్టి పచ్చిసేసేవా
సదరాన నన్నిటికి సమ్మతించి వుండఁగానే
వెదకి నన్నిందరిలో వింతసేసేవా
(॥ఏల॥)
తలవంచుకొని నీదగ్గర నే నుండఁగానే
నలినలిగా నన్ను నవ్వించేవా
కలసి నే నుండఁగానే గక్కన శ్రీవేంకటేశ
తళుకుఁజూపుసన్నల తమి రేఁచేవా
(||pallavi||)
ela yiṁta salamu yiṁti nenu
tālimido nuṁḍam̐gānu tamagiṁchenā
(||ela||)
munuba ne nīgunu mŏkkidi ne nanam̐gāne
sĕnagi sĕnagi marim̐ jeyivaṭṭevā
panivaḍi yippuḍiṭṭĕ paṁtamichchidi nanam̐gā
pĕnam̐gi sĕlulasedam̐ bilibiṁchevā
(||ela||)
idivo ne nīgunu ichchagamulāḍam̐gāne
padiri nāvŏḍivaṭṭi pachchisesevā
sadarāna nanniḍigi sammadiṁchi vuṁḍam̐gāne
vĕdagi nanniṁdarilo viṁtasesevā
(||ela||)
talavaṁchugŏni nīdaggara ne nuṁḍam̐gāne
nalinaligā nannu navviṁchevā
kalasi ne nuṁḍam̐gāne gakkana śhrīveṁkaḍeśha
taḽugum̐jūbusannala tami rem̐sevā