Ela yeṟamgavo kaaga yeege nimta sesidivi

ఏల యెఱఁగవో కాక యీకె నింత సేసితివి
Language

(॥పల్లవి॥)
ఏల యెఱఁగవో కాక యీకె నింత సేసితివి
నీ లీల లిన్నియును నిన్ను మోచిరాదా

(॥ఏల॥)
పచ్చిమాటలాడి ఇంతిభావము గరఁగఁజేసి
ఇచ్చట సిగ్గులెల్లా బాయిట వేసేవు
రచ్చల సవతులెల్లా రమణి నాడుకొంటేను
విచ్చలు నిదింతయును నిన్ను మోచి రాదా

(॥ఏల॥)
చెప్పరానిచేఁత సేసి చిప్పిలఁ జొక్కఁగఁజేసి
చొప్పులెత్తి మర్మాలు సోదించేవు
పుప్పతించి యిందుకుఁగా వువిదలు నవ్వితేను
నెప్పున నీ మహిమలు నిన్ను మోచి రాదా

(॥ఏల॥)
వెడరతులనుఁ గూడి వెరగందఁగాఁ జేసి
చిడుముడి వలపులఁ జిమ్మిరేఁచేవు
యెడనెడఁ దోడివారు యెగసక్కేలాడితేను
నిడివి శ్రీవేంకటేశ నిన్ను మోచిరాదా

(||pallavi||)
ela yĕṟam̐gavo kāga yīgĕ niṁta sesidivi
nī līla linniyunu ninnu mosirādā

(||ela||)
pachchimāḍalāḍi iṁtibhāvamu garam̐gam̐jesi
ichchaḍa siggulĕllā bāyiḍa vesevu
rachchala savadulĕllā ramaṇi nāḍugŏṁṭenu
vichchalu nidiṁtayunu ninnu mosi rādā

(||ela||)
sĕpparānisem̐ta sesi sippilam̐ jŏkkam̐gam̐jesi
sŏppulĕtti marmālu sodiṁchevu
puppadiṁchi yiṁdugum̐gā vuvidalu navvidenu
nĕppuna nī mahimalu ninnu mosi rādā

(||ela||)
vĕḍaradulanum̐ gūḍi vĕragaṁdam̐gām̐ jesi
siḍumuḍi valabulam̐ jimmirem̐sevu
yĕḍanĕḍam̐ doḍivāru yĕgasakkelāḍidenu
niḍivi śhrīveṁkaḍeśha ninnu mosirādā