Ela yemmelu seppeve imdaridonu

ఏల యెమ్మెలు చెప్పేవే ఇందరితోను
Language

(॥పల్లవి॥)
ఏల యెమ్మెలు చెప్పేవే ఇందరితోను
వాలాయించి యంత నీవు వక్కాణించనేఁటికి

(॥ఏల॥)
సతులలో నీవుండఁగా జాణతనా లాడెఁగాక
అతనికి నీకుఁ దొల్లి యంతపొందా
బతిమా లింటికి రాఁగా పాదాలు పైఁజాచెఁగాక
ఇతవె నీపైబత్తియేమి చెప్పేదే

(॥ఏల॥)
దిట్టవై నీవు నవ్వఁగా దిష్టించి చూచెఁగాక
నెట్టన నాతఁ డేవూరే నీ వేవూరే
చుట్టపువరుసగాఁగా చోటు నీకు నిచ్చెఁగాక
పట్టిచూచితేను నీపై పస యేమున్నదే

(॥ఏల॥)
పిన్నదానవుగాఁ గాను ప్రేమఁ జన్ను లంటెఁగాక
నిన్నుఁ గూడ నాతఁడెంత నీవెంతే
ఇన్నిటా శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె
సన్నల మీఇద్దరికి చవు లేమి చెప్పేదే

(||pallavi||)
ela yĕmmĕlu sĕppeve iṁdaridonu
vālāyiṁchi yaṁta nīvu vakkāṇiṁchanem̐ṭigi

(||ela||)
sadulalo nīvuṁḍam̐gā jāṇadanā lāḍĕm̐gāga
adanigi nīgum̐ dŏlli yaṁtabŏṁdā
badimā liṁṭigi rām̐gā pādālu paim̐jāsĕm̐gāga
idavĕ nībaibattiyemi sĕppede

(||ela||)
diṭṭavai nīvu navvam̐gā diṣhṭiṁchi sūsĕm̐gāga
nĕṭṭana nādam̐ ḍevūre nī vevūre
suṭṭabuvarusagām̐gā soḍu nīgu nichchĕm̐gāga
paṭṭisūsidenu nībai pasa yemunnade

(||ela||)
pinnadānavugām̐ gānu premam̐ jannu laṁṭĕm̐gāga
ninnum̐ gūḍa nādam̐ḍĕṁta nīvĕṁte
inniḍā śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nelĕ
sannala mīiddarigi savu lemi sĕppede