Ela yeda taamkimche veedagaadagu nimtula

ఏల యెడ తాఁకించే వీడకాడకు నింతుల
Language

(॥పల్లవి॥)
ఏల యెడ తాఁకించే వీడకాడకు నింతుల
మేలములాడుచునే నమ్మించవలెఁ గాక

(॥॥)
చాయపాటుమాటలకు సమ్మతించీనా చెలి
ఆయెడకు నీవుంగర మంపినఁగాక
చేయరానిసేఁతలెల్లాఁ జేసితివి తొలుతనె
చేయిపట్టి ప్రియమెల్లాఁ జెప్పవలెఁగాక

(॥॥)
అడియాస కానికల కాపె యీడకు వచ్చీనా
యెడయక నీవు వచ్చి యేలినఁగాక
తొడిఁబడ నీపై మోచె తోడనే ఆపెవలపు
గొడవదీరఁగ వేఁడుకొనవలెఁ గాక

(॥॥)
చుట్టి రాయబారాలకు చొక్కీనా అలమేల్మంగ
గుట్టున శ్రీవేంకటేశ కూడినఁగాక
చుట్టమవై వచ్చితివి సొరిది నీకెయింటికి
నెట్టన నిట్లానే మన్నించవలెఁగాక

(||pallavi||)
ela yĕḍa tām̐kiṁche vīḍagāḍagu niṁtula
melamulāḍusune nammiṁchavalĕm̐ gāga

(||||)
sāyabāḍumāḍalagu sammadiṁchīnā sĕli
āyĕḍagu nīvuṁgara maṁpinam̐gāga
seyarānisem̐talĕllām̐ jesidivi tŏludanĕ
seyibaṭṭi priyamĕllām̐ jĕppavalĕm̐gāga

(||||)
aḍiyāsa kānigala kābĕ yīḍagu vachchīnā
yĕḍayaga nīvu vachchi yelinam̐gāga
tŏḍim̐baḍa nībai mosĕ toḍane ābĕvalabu
gŏḍavadīram̐ga vem̐ḍugŏnavalĕm̐ gāga

(||||)
suṭṭi rāyabārālagu sŏkkīnā alamelmaṁga
guṭṭuna śhrīveṁkaḍeśha kūḍinam̐gāga
suṭṭamavai vachchidivi sŏridi nīgĕyiṁṭigi
nĕṭṭana niṭlāne manniṁchavalĕm̐gāga