ఏల వొత్తడించేరే యిన్నియునయ్యీఁ గాక
(॥పల్లవి॥)
ఏల వొత్తడించేరే యిన్నియునయ్యీఁ గాక
పోలికలొక్కటే యెట్టు పొందు సేసేదే
(॥ఏల॥)
సిరులతో మేననెల్లాఁ జెమటలు నిండఁగాను
గరిమనెట్లాఁ దన్నుఁ గాఁగిలించేదే
నిరతమై అంతకంటె నివ్వెరగు ముంచఁగాను
అరుదుగానెట్టు విడెమంది యిచ్చేదే
(॥ఏల॥)
ముక్కున నూరుపులు ముంచుకొని చెలఁగఁగా
మొక్కలాన నెటువలె మోవియిచ్చేదే
లక్కవలె మనసు యీలాగునఁ గరఁగఁగ
మక్కువతో నెటువలె మాటలాడేదే
(॥ఏల॥)
జడిగొని పులకలు జాజుకొని మొలవఁగా
చిడుముడి నెటువలె సేసవెట్టేదే
యెడయక శ్రీవేంకటేశుఁడిట్టె నన్ను నేలె
కడలేని యాసలెట్టు గాదెఁ బోసేదే
(||pallavi||)
ela vŏttaḍiṁchere yinniyunayyīm̐ gāga
poligalŏkkaḍe yĕṭṭu pŏṁdu sesede
(||ela||)
sirulado menanĕllām̐ jĕmaḍalu niṁḍam̐gānu
garimanĕṭlām̐ dannum̐ gām̐giliṁchede
niradamai aṁtagaṁṭĕ nivvĕragu muṁcham̐gānu
arudugānĕṭṭu viḍĕmaṁdi yichchede
(||ela||)
mukkuna nūrubulu muṁchugŏni sĕlam̐gam̐gā
mŏkkalāna nĕḍuvalĕ moviyichchede
lakkavalĕ manasu yīlāgunam̐ garam̐gam̐ga
makkuvado nĕḍuvalĕ māḍalāḍede
(||ela||)
jaḍigŏni pulagalu jājugŏni mŏlavam̐gā
siḍumuḍi nĕḍuvalĕ sesavĕṭṭede
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ nannu nelĕ
kaḍaleni yāsalĕṭṭu gādĕm̐ bosede