ఏల వూరకున్నదాన విటు నిన్నుఁ గూడుదాఁకా
(॥పల్లవి॥)
ఏల వూరకున్నదాన విటు నిన్నుఁ గూడుదాఁకా
పాలుప డిన్ని వ్రతాలు పట్టుకున్నాఁ డతఁడు
(॥ఏల॥)
తామెరలు ముడువఁడే తరుణి కెంగేలనే
తామెరలు(ల) చేత నంటి దగ్గరుదాఁకా
నేమముతో మేనిపైఁ బన్నీరు నించుకో నొల్లఁడే
దోమటి నీచెమటలఁ దొప్పఁదోఁగుదాఁకా
(॥ఏల॥)
అద్దము చూడనొల్లఁడే అంగన నీమించుఁజెక్కు
టద్దములు చూచుదాఁకా నాడ నుండి
వొద్దిక నారగించఁడే వూరేటినీమోవితేనె
అద్దుకొని చవిచూచినందాఁకను
(॥ఏల॥)
కప్పురము నొల్లఁడే కలికి నీసెలవుల-
కప్పురపు నవ్వు తన్నుఁ గప్పుదాఁకాను
ఇప్పుడే శ్రీవేంకటేశుఁ డీడకే విచ్చేసి కూడె
అప్పటి వేగిరించీ నీ వలమినందాఁకాను
(||pallavi||)
ela vūragunnadāna viḍu ninnum̐ gūḍudām̐kā
pāluba ḍinni vradālu paṭṭugunnām̐ ḍadam̐ḍu
(||ela||)
tāmĕralu muḍuvam̐ḍe taruṇi kĕṁgelane
tāmĕralu(la) seda naṁṭi daggarudām̐kā
nemamudo menibaim̐ bannīru niṁchugo nŏllam̐ḍe
domaḍi nīsĕmaḍalam̐ dŏppam̐dom̐gudām̐kā
(||ela||)
addamu sūḍanŏllam̐ḍe aṁgana nīmiṁchum̐jĕkku
ṭaddamulu sūsudām̐kā nāḍa nuṁḍi
vŏddiga nāragiṁcham̐ḍe vūreḍinīmovidenĕ
addugŏni savisūsinaṁdām̐kanu
(||ela||)
kappuramu nŏllam̐ḍe kaligi nīsĕlavula-
kappurabu navvu tannum̐ gappudām̐kānu
ippuḍe śhrīveṁkaḍeśhum̐ ḍīḍage vichchesi kūḍĕ
appaḍi vegiriṁchī nī valaminaṁdām̐kānu