ఏల వూరకున్నాఁడవు ఇంకా నీవు
(॥పల్లవి॥)
ఏల వూరకున్నాఁడవు ఇంకా నీవు
పాలించి మనలోనివే పంతాలు గావా
(॥ఏల॥)
మచ్చికతో నీవు నేను మాటలాడినందుకే
తచ్చి యాపె దిట్టుకొనీఁ దానేతాను
విచ్చనవిడి నందుకు వేఁడుకొనవయ్య నీవు
నెచ్చలి తన్నునుకొంటే నినునంట గాదా
(॥ఏల॥)
ఇద్దరము నేకతాన ఇట్లనుండినందుకే
కొద్దిమీరఁ జెలులపై గోపగించీని
బుద్దిచెప్పి చేయివట్టి బుజ్జగించవయ్య నీవు
పెద్దరిక మాపెది నీ పేరే యింతా గాదా
(॥ఏల॥)
మక్కువ శ్రీ వేంకటేశ మనము గూడినందుకే
కక్కసించి వూరకైనాఁ గాఁతాళించీని
వొక్కటే ఆపే నేను వొరసి కూడితి విదె
నిక్కము దెలుసుకొంటే నీవు నీవే కావా
(||pallavi||)
ela vūragunnām̐ḍavu iṁkā nīvu
pāliṁchi manalonive paṁtālu gāvā
(||ela||)
machchigado nīvu nenu māḍalāḍinaṁduge
tachchi yābĕ diṭṭugŏnīm̐ dānedānu
vichchanaviḍi naṁdugu vem̐ḍugŏnavayya nīvu
nĕchchali tannunugŏṁṭe ninunaṁṭa gādā
(||ela||)
iddaramu negadāna iṭlanuṁḍinaṁduge
kŏddimīram̐ jĕlulabai gobagiṁchīni
buddisĕppi seyivaṭṭi bujjagiṁchavayya nīvu
pĕddariga mābĕdi nī pere yiṁtā gādā
(||ela||)
makkuva śhrī veṁkaḍeśha manamu gūḍinaṁduge
kakkasiṁchi vūragainām̐ gām̐tāḽiṁchīni
vŏkkaḍe ābe nenu vŏrasi kūḍidi vidĕ
nikkamu dĕlusugŏṁṭe nīvu nīve kāvā