ఏల వూరకున్న దాపె యేఁటికి యిఁక వెరపు
(॥పల్లవి॥)
ఏల వూరకున్న దాపె యేఁటికి యిఁక వెరపు
తూలనాడితే నేనుఁ దోడై రానా
(॥ఏల॥)
ఆపెఁ బోలునా యీపె ఆతనిభ్రమత గాక
రూ పెరుఁగునా వలపు రుచులే కాక
యేపని సేయదో ఆపె యేమి సేసెనో యీపె
యేపని కింత సేసినా యిందరును మెచ్చరా
(॥ఏల॥)
వెగ్గళ్ళమా ఆపె కీపె విభునినేరమి గాక
సిగ్గెరుఁగునా వయసు చిక్చించుఁగాక
యెగ్గు లాపె యే మెంచెనో యపె యే మెంచదో కాని
కగ్గి యాపె మీరితేను కాంతుఁడే లోఁబడఁడా
(॥ఏల॥)
యేలదా యీపెను నాపె ఇద్దరిఁ దాఁ గూడెఁ గాక
వేళెరుఁగునా తమి వేదించుఁ గాక
నాలిఁ దగ దంటేఁ గూడె నన్ను శ్రీ వేంకటేశుఁడు
వోలి నిందుకే నవ్వితే నూరెల్ల ననరా
(||pallavi||)
ela vūragunna dābĕ yem̐ṭigi yim̐ka vĕrabu
tūlanāḍide nenum̐ doḍai rānā
(||ela||)
ābĕm̐ bolunā yībĕ ādanibhramada gāga
rū pĕrum̐gunā valabu rusule kāga
yebani seyado ābĕ yemi sesĕno yībĕ
yebani kiṁta sesinā yiṁdarunu mĕchcharā
(||ela||)
vĕggaḽḽamā ābĕ kībĕ vibhuninerami gāga
siggĕrum̐gunā vayasu sikchiṁchum̐gāga
yĕggu lābĕ ye mĕṁchĕno yabĕ ye mĕṁchado kāni
kaggi yābĕ mīridenu kāṁtum̐ḍe lom̐baḍam̐ḍā
(||ela||)
yeladā yībĕnu nābĕ iddarim̐ dām̐ gūḍĕm̐ gāga
veḽĕrum̐gunā tami vediṁchum̐ gāga
nālim̐ daga daṁṭem̐ gūḍĕ nannu śhrī veṁkaḍeśhum̐ḍu
voli niṁduge navvide nūrĕlla nanarā