ఏల వూరకుందానవు ఇద్దరముఁ జూచేము
(॥పల్లవి॥)
ఏల వూరకుందానవు ఇద్దరముఁ జూచేము
మూలల నొదుగనేల మొక్కవే నీ పతికి
(॥ఏల॥)
చెంగావిచీర గట్టి చెమటలు గారఁగాను
అంగమలయ వచ్చితి వద్దమరేయి
సంగతి గొలువున్నాఁడు సవరాజ్యమేలుదువు
ముంగైమురువులచేత మొక్కవే నీ పతికి
(॥ఏల॥)
నించినయసోదముతో నిద్దుర గంటంబెట్టక
మంచమెక్కేవు కాదారి మాదారి పొద్దు
మించి మోవితేనే నీకు మీఁదెత్తుకొనున్నాఁడు
ముంచి కోలుదువుగాని మొక్కవే నీ పతికి
(॥ఏల॥)
సరసపురతులను సాములెల్లా జేయుచును
విరతిఁ గాఁగిలించేవు నిశివేళను
అరిది శ్రీవేంకటేశుఁడట్టె మమ్మెల్లా నేలె
మురిపె మేమిటి కిఁక మొక్కవే నీపతికి
(||pallavi||)
ela vūraguṁdānavu iddaramum̐ jūsemu
mūlala nŏduganela mŏkkave nī padigi
(||ela||)
sĕṁgāvisīra gaṭṭi sĕmaḍalu gāram̐gānu
aṁgamalaya vachchidi vaddamareyi
saṁgadi gŏluvunnām̐ḍu savarājyameluduvu
muṁgaimuruvulaseda mŏkkave nī padigi
(||ela||)
niṁchinayasodamudo niddura gaṁṭaṁbĕṭṭaga
maṁchamĕkkevu kādāri mādāri pŏddu
miṁchi movidene nīgu mīm̐dĕttugŏnunnām̐ḍu
muṁchi koluduvugāni mŏkkave nī padigi
(||ela||)
sarasaburadulanu sāmulĕllā jeyusunu
viradim̐ gām̐giliṁchevu niśhiveḽanu
aridi śhrīveṁkaḍeśhum̐ḍaṭṭĕ mammĕllā nelĕ
muribĕ memiḍi kim̐ka mŏkkave nībadigi