ఏల వూరకుందానవే యెదుట నున్నాఁడతఁడు
(॥పల్లవి॥)
ఏల వూరకుందానవే యెదుట నున్నాఁడతఁడు
వాలాయించి నవ్వితేఁ గైవసమౌను పనులు
(॥ఏల॥)
తరుణికిఁ బతికిని తతి మాటలాడేటి
తరితీపు గలితేనే తమిరేఁగును
వొరసి అడియాసల నొకరొకరిమొగాలు
తిరిగి తిరిగి చూచితే వలపు నాటును
(॥ఏల॥)
రవళి మగవానితో రారాపులఁ బొందుసేసే-
సవతి గలిగితేనే చలివుట్టును
జవళిఁ గూచుండఁగాను సందుసుడి వేరొకతె
అవలఁ బయ్యాడితే నటు చల మెక్కును
(॥ఏల॥)
యెనసి వొండురులకు నిచ్చగించి రతులపై
మనసులు గలిగితేను మర్మాలంటును
చెనకి యలమేల్మంగ శ్రీవేంకటేశుఁ డితఁడు
విననఁ గొసరితే వేడుకలు వుట్టును
(||pallavi||)
ela vūraguṁdānave yĕduḍa nunnām̐ḍadam̐ḍu
vālāyiṁchi navvidem̐ gaivasamaunu panulu
(||ela||)
taruṇigim̐ badigini tadi māḍalāḍeḍi
taridību galidene tamirem̐gunu
vŏrasi aḍiyāsala nŏgarŏgarimŏgālu
tirigi tirigi sūside valabu nāḍunu
(||ela||)
ravaḽi magavānido rārābulam̐ bŏṁdusese-
savadi galigidene salivuṭṭunu
javaḽim̐ gūsuṁḍam̐gānu saṁdusuḍi verŏgadĕ
avalam̐ bayyāḍide naḍu sala mĕkkunu
(||ela||)
yĕnasi vŏṁḍurulagu nichchagiṁchi radulabai
manasulu galigidenu marmālaṁṭunu
sĕnagi yalamelmaṁga śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍu
vinanam̐ gŏsaride veḍugalu vuṭṭunu