Ela voddimchugonevu yiyyagoraadaa

ఏల వొడ్డించుకొనేవు యియ్యకోరాదా
Language

(॥పల్లవి॥)
ఏల వొడ్డించుకొనేవు యియ్యకోరాదా
మేలుది గనక నీతో మేలమాడీఁ జెలియ

(॥ఏల॥)
ముంగురులఁగుచ్చినముత్యాలు గదలఁగా
బంగారుపవ్వులచీరపయ్యెద జార
కంగుకంగుమనుచును కంకణా లోరయఁగాను
వుంగరాలవేళ్ల నీవొడివట్టీఁ జెలియ

(॥ఏల॥)
పెనుఁగొప్పుపై వజ్రాలబిల్లలు మెరవఁగాను
మినుకుఁ గమ్మలకాంతి మించఁగాను
పెనగొన్నహరములు బెరసి వుయ్యాలలూగ
ముసుకొని పలుమారు మొక్కీ నీకుఁ జెలియ

(॥ఏల॥)
పోలుపైన మాణికపులు బుజకీర్తులు వెలయ
ములువాఁడిచన్నులు మోము కెగర
అలమేలు మంగపతివైన శ్రీవేకంటేశ్వర
కలయుమనుచు నిన్నుఁగాఁగిలించీఁ జెలియ

(||pallavi||)
ela vŏḍḍiṁchugŏnevu yiyyagorādā
meludi ganaga nīdo melamāḍīm̐ jĕliya

(||ela||)
muṁgurulam̐guchchinamutyālu gadalam̐gā
baṁgārubavvulasīrabayyĕda jāra
kaṁgugaṁgumanusunu kaṁkaṇā lorayam̐gānu
vuṁgarālaveḽla nīvŏḍivaṭṭīm̐ jĕliya

(||ela||)
pĕnum̐gŏppubai vajrālabillalu mĕravam̐gānu
minugum̐ gammalagāṁti miṁcham̐gānu
pĕnagŏnnaharamulu bĕrasi vuyyālalūga
musugŏni palumāru mŏkkī nīgum̐ jĕliya

(||ela||)
polubaina māṇigabulu bujagīrdulu vĕlaya
muluvām̐ḍisannulu momu kĕgara
alamelu maṁgabadivaina śhrīvegaṁṭeśhvara
kalayumanusu ninnum̐gām̐giliṁchīm̐ jĕliya