Ela vodambarasevu yimtalonane nannu

ఏల వొడఁబరచేవు యింతలోననే నన్ను
Language

(॥పల్లవి॥)
ఏల వొడఁబరచేవు యింతలోననే నన్ను
నాలి సేసి నీతోను నవ్వేదాననా

(॥ఏల॥)
మన సిచ్చి నీవు నాతో మాట లెల్లాఁ జెప్పఁగాను
విని నవ్వవలెఁ గాక వేసరేనా
చనవు నీ విచ్చితివి సరి గాదా నను నేను
తనియఁగ వలె గాక తప్పు లెంచేనా

(॥ఏల॥)
చేయి పట్టుకొని నీవు చేఁత లెల్లఁ జేయఁగాను
యీయకొనవలెఁ గాక యీసడించేనా
ఆయాలు సోఁకించితివి ఆరమరచి చొక్కిలి
చాయ నేయవలెఁ గాక సాదించేనా

(॥ఏల॥)
కందువ నుచిని నీవు కాఁగిలింగి కూడఁగాను
పొందు సేయవలెఁ గాక పొద్దు వుచ్చేనా
ముందె శ్రీవెంటేశ మోహించితి కలసితి
చెంది మెచ్చవలెఁ గాక సిగ్గు వడేనా

(||pallavi||)
ela vŏḍam̐barasevu yiṁtalonane nannu
nāli sesi nīdonu navvedānanā

(||ela||)
mana sichchi nīvu nādo māḍa lĕllām̐ jĕppam̐gānu
vini navvavalĕm̐ gāga vesarenā
sanavu nī vichchidivi sari gādā nanu nenu
taniyam̐ga valĕ gāga tappu lĕṁchenā

(||ela||)
seyi paṭṭugŏni nīvu sem̐ta lĕllam̐ jeyam̐gānu
yīyagŏnavalĕm̐ gāga yīsaḍiṁchenā
āyālu som̐kiṁchidivi āramarasi sŏkkili
sāya neyavalĕm̐ gāga sādiṁchenā

(||ela||)
kaṁduva nusini nīvu kām̐giliṁgi kūḍam̐gānu
pŏṁdu seyavalĕm̐ gāga pŏddu vuchchenā
muṁdĕ śhrīvĕṁṭeśha mohiṁchidi kalasidi
sĕṁdi mĕchchavalĕm̐ gāga siggu vaḍenā