ఏల వొడఁబరచేవు యెందాఁకా మమ్ము
(॥పల్లవి॥)
ఏల వొడఁబరచేవు యెందాఁకా మమ్ము
చాలుకొన్న మీ గుణాలు సరియు బేసియునే
(॥ఏల॥)
నిండుక ఇందరిలోనా నీవు మంచివాఁడవే
కొండుకనీచేఁతలే గొరబు గాని
కొండలెల్లా నున్ననే కోరి దగ్గరి చూచితే
మెండుకొన్నరాలును మిక్కుటపు మాకులే
(॥ఏల॥)
అలరిననీమోవి అమృతము వంటిదే
అలవోకమాటలే అగడుగాని
జలనిధియంతా మీరే చవిగొన చూచితేను
వొలుగులువారఁ గడునుప్పులై వుండును
(॥ఏల॥)
శ్రీవేంకటేశుఁడ నీవు చింతించ దేవరవే
ఏవేళా నీకృప గడు నెక్కుడు గాని
భావింప నన్నేలితివి బలిమి తెంకాయమీఁదు
చేవదేరు లోపలెల్లా జిగిమించుఁ దీపులు
(||pallavi||)
ela vŏḍam̐barasevu yĕṁdām̐kā mammu
sālugŏnna mī guṇālu sariyu besiyune
(||ela||)
niṁḍuga iṁdarilonā nīvu maṁchivām̐ḍave
kŏṁḍuganīsem̐tale gŏrabu gāni
kŏṁḍalĕllā nunnane kori daggari sūside
mĕṁḍugŏnnarālunu mikkuḍabu māgule
(||ela||)
alarinanīmovi amṛtamu vaṁṭide
alavogamāḍale agaḍugāni
jalanidhiyaṁtā mīre savigŏna sūsidenu
vŏluguluvāram̐ gaḍunuppulai vuṁḍunu
(||ela||)
śhrīveṁkaḍeśhum̐ḍa nīvu siṁtiṁcha devarave
eveḽā nīkṛpa gaḍu nĕkkuḍu gāni
bhāviṁpa nannelidivi balimi tĕṁkāyamīm̐du
sevaderu lobalĕllā jigimiṁchum̐ dībulu