Ela vodambaraseve yippudu nannu

ఏల వొడఁబరచేవే యిప్పుడు నన్ను
Language

(॥పల్లవి॥)
ఏల వొడఁబరచేవే యిప్పుడు నన్ను
మేలిమి పతి వచ్చితే మెఱయించే వలపు

(॥॥)
చనవు గలవేళను సరసములాడవచ్చు
ననుచని వేళను నవ్వులేడనే
మనసులేకములై తే మర్మములు సమకూడు
పెనఁగేటి వేళను బెరయునా పొందులు

(॥॥)
మొక్కేటి వేళను ముందుముందే దయగల్గు
తక్కించే వేళను తనివేడదే
వొక్కటైన వేళను వొడఁబడు మాటలు
కక్కసించే వేళను కతలు చౌలౌనా

(॥॥)
కూడిన యీవేళను గురుతులెల్లా నిండు
మేడెపు రతివేళను మేరగలదా
యీడనే శ్రీవేంకటేశు డింతలోనే నన్ను నేలె
వేడుకయిన వేళను వేసటలు వుట్టునా

(||pallavi||)
ela vŏḍam̐baraseve yippuḍu nannu
melimi padi vachchide mĕṟayiṁche valabu

(||||)
sanavu galaveḽanu sarasamulāḍavachchu
nanusani veḽanu navvuleḍane
manasulegamulai te marmamulu samagūḍu
pĕnam̐geḍi veḽanu bĕrayunā pŏṁdulu

(||||)
mŏkkeḍi veḽanu muṁdumuṁde dayagalgu
takkiṁche veḽanu taniveḍade
vŏkkaḍaina veḽanu vŏḍam̐baḍu māḍalu
kakkasiṁche veḽanu kadalu saulaunā

(||||)
kūḍina yīveḽanu gurudulĕllā niṁḍu
meḍĕbu radiveḽanu meragaladā
yīḍane śhrīveṁkaḍeśhu ḍiṁtalone nannu nelĕ
veḍugayina veḽanu vesaḍalu vuṭṭunā