Ela veraseve neevu yidivo nee padi vachche

ఏల వెరచేవే నీవు యిదివో నీ పతి వచ్చె
Language

(॥పల్లవి॥)
ఏల వెరచేవే నీవు యిదివో నీ పతి వచ్చె
జాలివాయ నిన్నుఁగూడి సంతసమిచ్చీని

(॥ఏల॥)
నీరధిలోఁ బుట్టివట్టి నీరుచిచ్చైన పూవు
నూరిపోసినట్టి పామునోరిలో కడి
మారుతో నగ్నిఁబడిన మాకులలో భూతము
యీరీతి విరహులకెగ్గు సేయకుందురా

(॥ఏల॥)
తల్లిదండ్రి వెంచనట్టి తగుఁబలుగాకి చూర
చల్లుఁ బుప్పొడి దొంగిలిన జాజరకాఁడు
మల్లాడి చెట్లమీఁద మధువువట్టిన పాత
వెల్లిగా మంచిగుణాలు వీనికింక వచ్చునా

(॥ఏల॥)
వంగి వంచనేర్చిన వడిఁదియ్యని గుణము
ముంగిట నిందరి చిత్తముల వేలుపు
ఇంగితాన శ్రీ వేంకటేశు నిన్నుఁ గూడఁజేసి
రంగన నీపాలింటికి అందరను హితులే

(||pallavi||)
ela vĕraseve nīvu yidivo nī padi vachchĕ
jālivāya ninnum̐gūḍi saṁtasamichchīni

(||ela||)
nīradhilom̐ buṭṭivaṭṭi nīrusichchaina pūvu
nūribosinaṭṭi pāmunorilo kaḍi
mārudo nagnim̐baḍina māgulalo bhūdamu
yīrīdi virahulagĕggu seyaguṁdurā

(||ela||)
tallidaṁḍri vĕṁchanaṭṭi tagum̐balugāgi sūra
sallum̐ buppŏḍi dŏṁgilina jājaragām̐ḍu
mallāḍi sĕṭlamīm̐da madhuvuvaṭṭina pāda
vĕlligā maṁchiguṇālu vīnigiṁka vachchunā

(||ela||)
vaṁgi vaṁchanersina vaḍim̐diyyani guṇamu
muṁgiḍa niṁdari sittamula velubu
iṁgidāna śhrī veṁkaḍeśhu ninnum̐ gūḍam̐jesi
raṁgana nībāliṁṭigi aṁdaranu hidule