Ela vegirimpimchere yemire vo selulaala

ఏల వేగిరింపించేరే యేమిరే వో చెలులాల
Language

(॥పల్లవి॥)
ఏల వేగిరింపించేరే యేమిరే వో చెలులాల
చాలుకొన్న నాయకుని చరితలు చూడకా

(॥ఏల॥)
నగినయంతటిలొనె నాకు దగ్గర వచ్చునా
తెగ నాడి మన సెల్లఁ దెలియకా
మొగుము చూచె నంటాను ముచ్చ టాడ వచ్చునా
మగవాఁడని లోనిమర్మములు గానకా

(॥ఏల॥)
వద్ద నున్నాఁ డంటాను వావి చెప్ప వచ్చునా
కొద్ది నాతఁ డుండేటిగు ట్టెరంగకా
పెద్ద చేసె నంటానె పెనగొన వచ్చునా
వుద్దండీఁ డీతని మేనివొరపు లరయకా

(॥ఏల॥)
యింటికి వచ్చె నంటాను యియ్యకొన వచ్చునా
అంటిము ట్టాతనిసుద్దు లడుగకా
దంట శ్రీవెంకటేశుఁడు తా నలమేలుమంగను
జం టాయ మీర వచ్చునా చవులు సోదించకా

(||pallavi||)
ela vegiriṁpiṁchere yemire vo sĕlulāla
sālugŏnna nāyaguni saridalu sūḍagā

(||ela||)
naginayaṁtaḍilŏnĕ nāgu daggara vachchunā
tĕga nāḍi mana sĕllam̐ dĕliyagā
mŏgumu sūsĕ naṁṭānu muchcha ṭāḍa vachchunā
magavām̐ḍani lonimarmamulu gānagā

(||ela||)
vadda nunnām̐ ḍaṁṭānu vāvi sĕppa vachchunā
kŏddi nādam̐ ḍuṁḍeḍigu ṭṭĕraṁgagā
pĕdda sesĕ naṁṭānĕ pĕnagŏna vachchunā
vuddaṁḍīm̐ ḍīdani menivŏrabu larayagā

(||ela||)
yiṁṭigi vachchĕ naṁṭānu yiyyagŏna vachchunā
aṁṭimu ṭṭādanisuddu laḍugagā
daṁṭa śhrīvĕṁkaḍeśhum̐ḍu tā nalamelumaṁganu
jaṁ ṭāya mīra vachchunā savulu sodiṁchagā