ఏల వేగిరించేవు యింటిపని గద్దు నాకు
(॥పల్లవి॥)
ఏల వేగిరించేవు యింటిపని గద్దు నాకు
గోలవై వెలుపుల అరఁగుపై నుండవయ్యా
(॥ఏల॥)
మందలోన నున్ననేము మాపటంతఁ గాని రాము
దిందుపడఁ గొంగువట్టి తియ్యకువయ్య
పొంది ఆవులు దూడలు బొలానఁ గలసుఁ జేసు
అందాఁకా నీవు మాయింటియాడ నుండవయ్యా
(॥ఏల॥)
చల్ల దచ్చి తచ్చి నేఁడు సందు లెల్ల నాకు నొచ్చు
వొల్లనె విడె మిమ్మనే వోపనయ్య
గొల్లఁడు దెచ్చినపాలకుండ లందుకొనవలె
యిల్లు చొచ్చి అట్టుగపై నెక్కు కుండవయ్య
(॥ఏల॥)
వెన్న గాఁచేవేళను విను మనఁ జాలను
చన్ను లేల పిసికేవు సారెకు నయ్య
యెన్నికతో శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
పన్నిన మామంచముపై బవ్వళించవయ్యా
(||pallavi||)
ela vegiriṁchevu yiṁṭibani gaddu nāgu
golavai vĕlubula aram̐gubai nuṁḍavayyā
(||ela||)
maṁdalona nunnanemu mābaḍaṁtam̐ gāni rāmu
diṁdubaḍam̐ gŏṁguvaṭṭi tiyyaguvayya
pŏṁdi āvulu dūḍalu bŏlānam̐ galasum̐ jesu
aṁdām̐kā nīvu māyiṁṭiyāḍa nuṁḍavayyā
(||ela||)
salla dachchi tachchi nem̐ḍu saṁdu lĕlla nāgu nŏchchu
vŏllanĕ viḍĕ mimmane vobanayya
gŏllam̐ḍu dĕchchinabālaguṁḍa laṁdugŏnavalĕ
yillu sŏchchi aṭṭugabai nĕkku kuṁḍavayya
(||ela||)
vĕnna gām̐seveḽanu vinu manam̐ jālanu
sannu lela pisigevu sārĕgu nayya
yĕnnigado śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
pannina māmaṁchamubai bavvaḽiṁchavayyā