ఏల వేగిరించేవు యింతలోననే నీవు
(॥పల్లవి॥)
ఏల వేగిరించేవు యింతలోననే నీవు
కాలుదొక్కినప్పుడే కరఁగించీఁ గాక
(॥ఏల॥)
నిన్ను నేమైనా దిట్టెనా నెలత నీచేతలకు
చన్నుల మొనలనే సాదించీగాక
యెన్నిసుద్దులు చెప్పినా యెదురు నీ కాడీనా
సన్నలచాయలనే చక్క బెట్టీ గాక
(॥ఏల॥)
కోపగించీనా ఆపె కొండుకనీసుద్దులకు
చూపులకొనలనే సోదించీగాక
మాపుదాకా నవ్వినాను మారుకొనీనా నీతో
తీపులమాటలనే తిద్దుకొనీగాక
(॥ఏల॥)
జంకించీనా నేడు సతి నీగుణములకు
పొంకపురతులనే భోగించీగాక
అంకెల శ్రీవేంకటేశ ఆపె నీవు గూడితిరి
మంకుదనాలు చూపీనా మనసిచ్చీ గాక
(||pallavi||)
ela vegiriṁchevu yiṁtalonane nīvu
kāludŏkkinappuḍe karam̐giṁchīm̐ gāga
(||ela||)
ninnu nemainā diṭṭĕnā nĕlada nīsedalagu
sannula mŏnalane sādiṁchīgāga
yĕnnisuddulu sĕppinā yĕduru nī kāḍīnā
sannalasāyalane sakka bĕṭṭī gāga
(||ela||)
kobagiṁchīnā ābĕ kŏṁḍuganīsuddulagu
sūbulagŏnalane sodiṁchīgāga
mābudāgā navvinānu mārugŏnīnā nīdo
tībulamāḍalane tiddugŏnīgāga
(||ela||)
jaṁkiṁchīnā neḍu sadi nīguṇamulagu
pŏṁkaburadulane bhogiṁchīgāga
aṁkĕla śhrīveṁkaḍeśha ābĕ nīvu gūḍidiri
maṁkudanālu sūbīnā manasichchī gāga