Ela vegirimchevu yemtigi neegu naluga

ఏల వేగిరించేవు యేఁటికి నీకు నలుక
Language

(॥పల్లవి॥)
ఏల వేగిరించేవు యేఁటికి నీకు నలుక
నాలితనమెల్లా మాని నవ్వు నవ్వవయ్యా

(॥ఏల॥)
తిట్టినపెదవినే దీవించె నదె యాకె
పట్టిన చలము మాని పలుకవయ్యా
నెట్టన నింతకతొల్లి నీవుసేసినటియా
దట్టపుఁ జేఁత లేఁటివో తలఁచుకోవయ్యా

(॥ఏల॥)
దొబ్బినచేతులనే దోసిలించి మొక్కీ నాకె
అబ్బురా లేఁటికి విడె మందియ్యవయ్యా
గబ్బితనాన నీవొళ్లఁ గలిగినయట్టియా
తబ్బిబ్బుచేఁత లేఁటివో తలఁచుకోవయ్యా

(॥ఏల॥)
వొరసిన చన్నులనే వొత్తి నిన్నుఁ గూడె నాకె
మరిగికూడితి విట్టె మన్నించవయ్యా
యెరవుల శ్రీవేంకటేశ నీచిన్ననాఁటి
ధరలోనిపను లెల్లాఁ దలఁచుకోవయ్యా

(||pallavi||)
ela vegiriṁchevu yem̐ṭigi nīgu naluga
nālidanamĕllā māni navvu navvavayyā

(||ela||)
tiṭṭinabĕdavine dīviṁchĕ nadĕ yāgĕ
paṭṭina salamu māni palugavayyā
nĕṭṭana niṁtagadŏlli nīvusesinaḍiyā
daṭṭabum̐ jem̐ta lem̐ṭivo talam̐sugovayyā

(||ela||)
dŏbbinasedulane dosiliṁchi mŏkkī nāgĕ
abburā lem̐ṭigi viḍĕ maṁdiyyavayyā
gabbidanāna nīvŏḽlam̐ galiginayaṭṭiyā
tabbibbusem̐ta lem̐ṭivo talam̐sugovayyā

(||ela||)
vŏrasina sannulane vŏtti ninnum̐ gūḍĕ nāgĕ
marigigūḍidi viṭṭĕ manniṁchavayyā
yĕravula śhrīveṁkaḍeśha nīsinnanām̐ṭi
dharalonibanu lĕllām̐ dalam̐sugovayyā