Ela vegirimchevu yemmelela sesevu

ఏల వేగిరించేవు యెమ్మెలేల సేసేవు
Language

(॥పల్లవి॥)
ఏల వేగిరించేవు యెమ్మెలేల సేసేవు
తాలిమితోఁ గాని కాని దక్కేవు నీవు నాకు

(॥ఏల॥)
సిగ్గుతో నేమరుండఁగాఁ జెక్కు గోర నొత్తితివి
దగ్గరుమా గోరు నిన్నుఁ దాఁకించే నేను
సగ్గక అల్లంతనుండి సాములెన్ని సేసినాను
అగ్గమై రావలెఁగా మాయండకు నీవిపుడు

(॥ఏల॥)
పరాకై వుండఁగా నిమ్మపంట నీవు వేసితివి
మరల వేయిమా నిన్ను మళ్ల వేసేను
తెరాకడనుండి నీవు తిలకించి చూచేవు
విరాలిఁ బానుపు పైకి విచ్చేయవలెఁగా

(॥ఏల॥)
నిద్దిరించేవేళఁగా నీవు నావురమెక్కితిఁ
వొద్దికఁ బొరలుమా నీవుర మెక్కేను
గద్దరి శ్రీ వేంకటేశ కాఁగిట బిగించేవు
వద్దు ఇంకా నావంతుఁ రావలెగా రతులకు

(||pallavi||)
ela vegiriṁchevu yĕmmĕlela sesevu
tālimidom̐ gāni kāni dakkevu nīvu nāgu

(||ela||)
siggudo nemaruṁḍam̐gām̐ jĕkku gora nŏttidivi
daggarumā goru ninnum̐ dām̐kiṁche nenu
saggaga allaṁtanuṁḍi sāmulĕnni sesinānu
aggamai rāvalĕm̐gā māyaṁḍagu nīvibuḍu

(||ela||)
parāgai vuṁḍam̐gā nimmabaṁṭa nīvu vesidivi
marala veyimā ninnu maḽla vesenu
tĕrāgaḍanuṁḍi nīvu tilagiṁchi sūsevu
virālim̐ bānubu paigi vichcheyavalĕm̐gā

(||ela||)
niddiriṁcheveḽam̐gā nīvu nāvuramĕkkidim̐
vŏddigam̐ bŏralumā nīvura mĕkkenu
gaddari śhrī veṁkaḍeśha kām̐giḍa bigiṁchevu
vaddu iṁkā nāvaṁtum̐ rāvalĕgā radulagu